Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబి దర్శకత్వంలో కాకా సినిమా(Kaaka Movie) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా పై కూడా అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈయన ‘ కాకా’ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఇక 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే చాలా సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా సంక్రాంతి రేసులో చిరంజీవి (Chiranjeevi)’ కాకా’ సినిమా కూడా ఉంది. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. జనవరి 13, 2027న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పోటీ నుంచి చిరంజీవి కాకా సినిమా తప్పుకుందని వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ విడుదల చేశారు. చిరంజీవి ‘ కాకా’ సినిమా తదుపరి షెడ్యూల్ గురించి చిత్ర నిర్మాతలు కీలక అప్డేట్ తెలియజేశారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాదులో ఒక భారీ సెట్ లో షూటింగ్ పనులను జరుపుకోబోతుందని వెల్లడించారు. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్ల సమాచారం.
Our #KAAKA will be BACK IN ACTION from September 7th in Hyderabad! 💥
A lengthy and crucial schedule featuring Megastar @KChiruTweets Garu and the main cast is all set to begin. ❤️🔥
Worldwide Grand Release on January 13th, 2027 🔥
A @DirBobby Film🪓
Produced by @TheKVNOfficial… pic.twitter.com/uVVRSIJmtw— Kaaka (@KaakaMovie) September 4, 2026
ఇకపోతే ఈ సినిమా విడుదల గురించి కూడా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదు యధావిధిగా ఈ సినిమా 2027 జనవరి 13వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా అని ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర బృందం మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇలా సంక్రాంతి బరిలోనే మెగాస్టార్ చిరంజీవి పోటీకి సిద్ధమవుతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన మొదటి భాగానికి సంబంధించి ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేద పేతురాజ్ , కమెడియన్స్ సునీల్, గెటప్ శ్రీను వంటి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Also Read: రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?