Mirzapur Review: ‘మీర్జాపూర్..ఓటీటీలో ’ఈ సిరీస్ చూడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.ముఖ్యంగా కాలీన్ భయ్యా, మున్నా భయ్యా, గుడ్డూ పండిట్.. ఈ పేర్లు వింటేనే ఒక రేంజ్ క్రైమ్ డ్రామా గుర్తుకొస్తుంది. ఇక ఇప్పటిదాకా వెబ్ సిరీస్‌గా అలరించిన ఈ కథ ఇప్పుడు డైరెక్ట్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా..? చూసేద్దాం.
కథంతా మీర్జాపూర్ గద్దె కోసం జరిగే కొట్లాటే పవర్ ఒకసారి చేతికి దొరికాక దాన్ని ఎవడూ వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు. పాత కక్షలు, ఇంట్లో గొడవలు, నమ్మినోళ్లే వెన్నుపోటు పొడవడం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి.కాలీన్ భయ్యా తన పాత సైలెంట్ విలనిజంతో ఉంటే, గుడ్డూ పండిట్ మాత్రం పగతో రగిలిపోతుంటాడు.
వీళ్లిద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్‌కి మున్నా భయ్యా కేరెక్టర్ ఇచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవల్. ఇక మధ్యలో బబ్బన్ యాదవ్ ఎంట్రీ ఇవ్వడంతో కథలోకి పాలిటిక్స్ కూడా వచ్చి చేరుతాయి.చివరికి మీర్జాపూర్ ఎవరి చేతికి దక్కింది? ఎవరు ఎవరికి స్కెచ్ వేశారు? అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
ఈ సినిమాలో ఎవరైనా స్క్రీన్‌ను షేక్ చేశారంటే అది ఖచ్చితంగా మున్నా భయ్యానే. దివ్యేందు శర్మ అసలు తగ్గేదేలే అన్నట్టు నటించాడు. ఆ పొగరు, యాటిట్యూడ్, క్షణాల్లో మారిపోయే ఎక్స్‌ప్రెషన్స్ పిచ్చెక్కిస్తాయి.మున్నా భయ్యా స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి థియేటర్లో ఎనర్జీ మారిపోతుంది. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి.
పంకజ్ త్రిపాఠి నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏమాత్రం అరావకుండా, కేవలం చూపులతోనే భయపెట్టేస్తాడు.కాలీన్ భయ్యాలో ఉండే ఆ రాయల్ లుక్, కూల్ అండ్ డేంజరస్ క్యారెక్టర్‌ను ఆయన చాలా ఈజీగా చేశారు. పెద్దగా మాట్లాడకపోయినా ఆ సైలెన్స్‌లోనే అసలైన పవర్ కనిపిస్తుంది.
గుడ్డూ పాత్రలో అలీ ఫజల్ మరోసారి దుమ్మురేపాడనే చెప్పాలి. ఫిజిక్ పరంగానే కాకుండా, ఆవేశాన్ని యాక్షన్ సీన్స్‌లో బాగా చూపించాడు.ఇక పగ తీర్చుకోవాలనే కసితో ఉండే రఫ్ లుక్ ఆయనకు బాగా సెట్ అయింది. ఫైట్ సీన్లలో అలీ ఫజల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
బబ్బన్ యాదవ్‌గా రవికిషన్ ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటిదాకా కేవలం గ్యాంగ్ వార్‌గా సాగిన కథలోకి పొలిటికల్ గొడవలు రావడం ఆసక్తికరంగా ఉంటుంది.రవికిషన్ తన నటనతో పొలిటికల్ లీడర్లకు ఉండే కన్నింగ్ నెస్‌ను బాగా పండించారు.
పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ లొకేషన్లు, డార్క్ థీమ్ చాలా బాగా అనిపిస్తాయి. క్రైమ్ వరల్డ్‌ను రియలిస్టిక్‌గా చూపించారు.అన్నింటికంటే ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. గన్ సౌండ్లు, ఛేజింగ్ సీన్లలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్లో కిక్ ఇస్తాయి.
* మున్నా భయ్యా, కాలీన్ భయ్యా, గుడ్డూ పండిట్ సీన్లు
* యాక్షన్ సీన్లు
* BGM
* పొలిటికల్ ట్విస్టులు
* రా అండ్ రస్టిక్ మేకింగ్
* అక్కడక్కడా సీన్లలో ల్యాగ్
* మొదటిసారి చూస్తే కాస్త కష్టమే
* విపరీతమైన హింస
మీర్జాపూర్ సిరీస్ చూసి ఫిదా అయినవారికి ఈ బిగ్ స్క్రీన్ వెర్షన్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. మనకు తెలిసిన క్యారెక్టర్లనే థియేటర్లో పెద్దగా చూడటం బాగుంటుంది. ముఖ్యంగా మున్నా, కాలీన్, గుడ్డూల మధ్య జరిగే పవర్ గేమ్ సినిమాకు మేజర్ హైలైట్.
కాకపోతే సిరీస్ అసలు చూడని వాళ్లకు కొన్ని క్యారెక్టర్లు, వాటి మధ్య ఏం జరిగింది అన్నది త్వరగా కనెక్ట్ కావు. అలాగే విపరీతమైన వయొలెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో వెళ్లడం కష్టమే.
మొత్తానికి.. క్రైమ్, గ్యాంగ్‌స్టర్ సినిమాలు, మాస్ యాక్షన్, పాలిటిక్స్ ఇష్టపడే వాళ్లు ఈ ‘మీర్జాపూర్’ థియేటర్ రైడ్‌ను ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.