E-Paper
Advertisement

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ
Advertisement

Comedy Horror Adventure: ఓ భారీ నిధి కోసం ఓ గ్యాంగ్ అడవిలోకి వెళ్తే ? అక్కడ నిధి కంటే ముందే దెయ్యాలు ఎదురైతే ? భయంతో పారిపోవాల్సిన పరిస్థితిలో కూడా వాళ్లకు వచ్చే పిచ్చి ఆలోచనలు నవ్వు తెప్పిస్తే ? కామెడీకి హారర్, అడ్వెంచర్, ఫాంటసీ, యాక్షన్ కలిస్తే ఎలా ఉంటుందో చూపించే ‘Dhamaal 4’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ‘ధమాల్’ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈసారి కూడా నిధి కోసం మొదలయ్యే వేటే కథకు అసలు బేస్‌ గా మారుతుంది. కానీ ఆ నిధి కోసం వెళ్తున్న వాళ్లకు ఎదురయ్యే వింత పరిస్థితులు, భయపెట్టే సంఘటనలు, ఊహించని ట్విస్టులు కథను మరో లెవల్‌ కి తీసుకెళ్తాయి. మరి ఈసారి నిధి కోసం ఎవరు బయలుదేరారు ? వాళ్లకు ఎదురైన దెయ్యాల కథేంటి ? నిధి దొరికిందా లేదా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

‘ధమాల్ 4’లో కూడా ఓ గ్యాంగ్ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈసారి వాళ్ల ముందున్న లక్ష్యం భారీ నిధి. ఆ నిధి గురించి తెలిసిన వెంటనే దాన్ని సొంతం చేసుకోవడానికి బయలుదేరిన ఈ గ్యాంగ్‌కు అడుగడుగునా కొత్త సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా నిధి కోసం చేసే వేటలో మ్యాప్స్, క్లూస్, ప్రమాదాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం వీటితో పాటు దెయ్యాల భయం కూడా తోడవుతుంది. నిధి దాగి ఉన్న ప్రాంతానికి వెళ్లే కొద్దీ పరిస్థితులు మరింత వింతగా మారుతాయి. ఒక్కో క్లూ వాళ్లను ముందుకు తీసుకెళ్తున్నా, అదే సమయంలో కొత్త ప్రమాదంలోకి నెట్టేస్తుంది.

Advertisement

దెయ్యాలు కనిపించడం, భయంకరమైన సంఘటనలు జరగడం, వాటి నుంచి తప్పించుకునేందుకు ఈ గ్యాంగ్ చేసే పిచ్చి పనులు సినిమాకు కామెడీ టచ్ ఇస్తాయి. ఒకవైపు నిధి కోసం పోటీ, మరోవైపు ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి… ఈ రెండింటి మధ్య వాళ్లు చేసే హంగామానే అసలు ఎంటర్‌టైన్మెంట్. ఇక్కడే కథలో ఊహించని ట్విస్టులు మొదలవుతాయి. వాళ్లు వెతుకుతున్న నిధి వెనుక అసలు రహస్యం ఏంటి ? దెయ్యాల కథకు, నిధి వేటకు సంబంధం ఏమిటి ? ఈ గ్యాంగ్‌లో ఎవరు నిజంగా నిధి కోసం వచ్చారు, ఎవరు ఇంకేదో ప్లాన్‌తో ఉన్నారు ? చివరికి నిధి ఎవరి చేతికి చిక్కుతుంది ? అనేది సినిమా చూసినప్పుడే తెలుస్తుంది.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

హిందీ కామెడీ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ డ్రామా మూవీ ‘ధమాల్ 4’. ఈరోజు నుంచే Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీతో పాటు హారర్, అడ్వెంచర్, ఫాంటసీ ఎలిమెంట్స్ కలిసిన సినిమా కావడంతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి కాకుండా, ఫ్రెండ్స్‌తో కూర్చొని పిచ్చిపిచ్చిగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ మూవీ మరింత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నిధి వేట, దెయ్యాల భయం, గ్యాంగ్ చేసే కామెడీ, ఊహించని ట్విస్టులు ఉన్న ఈ మూవీ ఈ వీకెండ్ కి మంచి ఫన్ రైడ్ అవుతుంది.

Advertisement

Read Also: మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Tags

Related News

కూతురిని కాపాడాలంటే భార్యను పంపమనే మాఫియా డాన్… 8.8 రేటింగ్‌తో దూసుకెళ్తున్న తెలుగు థ్రిల్లర్

పూజారి అంటే పూజలే అనుకుంటున్నారా ? విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఫైటర్… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

దుల్కర్‌ సినిమా స్ట్రీమింగ్ విషయంలో గందరగోళం… స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ? ఎప్పటి నుంచి ?

అపార్ట్‌మెంట్‌లో వరుస మిస్సింగ్స్.. ఆ బిల్డింగ్ కేర్‌టేకర్‌ వెనుక దాగిన భయంకర నిజం… హాలీవుడ్ హారర్ థ్రిల్లర్

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

Big Stories

Advertisement
×