E-Paper
Advertisement

Chiranjeevi vs Ram Charan: యూట్యూబ్ లో మీసాల పిల్లా హవా… పోటీ పడుతున్న తండ్రి కొడుకులు!

Chiranjeevi vs Ram Charan: యూట్యూబ్ లో మీసాల పిల్లా హవా… పోటీ పడుతున్న తండ్రి కొడుకులు!
Advertisement

Chiranjeevi vs Ram Charan: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG)సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది .ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాకు కావలసినంత హైప్ క్రియేట్ చేస్తున్నారు.

మీసాల పిల్ల సాంగ్..

ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే .అయితే మీసాల పిల్ల సాంగ్(Meesala Pilla Song) మాత్రం యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తుంది. ఈ పాట ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడంతో చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ (Ramcharan)చికిరి చికిరి (Chikiri Chikiri)పాటకు పోటీగా దూసుకుపోతున్నారు.

Advertisement

Also Read: MSVPG Film: మన శంకర వరప్రసాద్ గారిలో వెంకటేష్ పాత్ర ఎప్పుడో రివీల్ చేసిన డైరెక్టర్..

100 మిలియన్ వ్యూస్..

రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఈ పాటకు అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుంది. ఇలా తండ్రి కొడుకులిద్దరూ తమ సినిమాల విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఇక చిరంజీవి నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాగా రామ్ చరణ్ సినిమా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రామ్ చరణ్ సినిమాపై కూడా అభిమానులు భారీ స్థాయిలో అంచనాలను పెట్టుకున్నారు.

Advertisement

ఇక రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు ఈయన సెకండ్ ఇన్నింగ్స్ లో  వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్నారు.  ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో సందడి చేయనున్నారు. వెంకటేష్ పాత్ర దాదాపు 25 నిమిషాల పాటు ఉండబోతుందని అనిల్ రావిపూడి తెలియజేశారు. ఇక చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో కూడా మాస్ సాంగ్ ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫుల్ సాంగ్ విడుదల చేయడంతో ఈ సాంగ్ కాస్త సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చింది.

Also Read: Naveen Polishetty: చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి.. ఎందుకు భయపడాలంటూ?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×