E-Paper
Advertisement

Naveen Polishetty: చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి.. ఎందుకు భయపడాలంటూ?

Naveen Polishetty: చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి.. ఎందుకు భయపడాలంటూ?
Advertisement

Naveen Polishetty: సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. సంక్రాంతి పండుగను రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రాలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం పట్టణాలలో ఉన్న వారందరూ కూడా పల్లెటూరుకు చేరుకొని పెద్ద ఎత్తున సందడిగా పండుగ చేసుకోవడమే కాకుండా సినిమాలకు కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. అందుకే సంక్రాంతి పండుగను సినిమాల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఇక సంక్రాంతి సందర్భంగా చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున బాక్స్ ఆఫీస్ బరిలో పోటీకి దిగుతూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా భారీగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు..

మామూలుగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటేనే చిన్న హీరోలు పక్కకు తప్పుకుంటారు కానీ సంక్రాంతి పండుగ విషయంలో ఇలాంటిది ఏవి ఉండవు ఎవరి సామర్థ్యం వారిదే అంటూ పోటీకి సిద్ధపడుతూ ఉంటారు. ఇక 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్, చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు పోటీ పడబోతున్నారు .వీరితోపాటు చిన్న హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) సైతం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

Advertisement

Also Read: Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు రన్ టైం లాక్.. నిడివి ఎంతంటే?

చిరంజీవి గారి వల్లే సక్సెస్..

ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఇటీవల పెళ్లి రిసెప్షన్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వినూత్న రీతిలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా వారి నుంచి నవీన్ పోలిశెట్టికి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో పోటీకి వస్తున్నారు..భయం వేయడం లేదా? అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నవీన్ పోలిశెట్టి సమాధానం చెబుతూ… చిరంజీవి గారి సినిమా వస్తే భయం ఎందుకు ఈరోజు నాలాగా ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారంటే అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన వల్లే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నాము.

Advertisement

మన శంకర వరప్రసాద్ గారు..

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులందరూ కూడా చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu) సినిమా చూసిన అనంతరం మా సినిమాకి వచ్చి మా సినిమాని కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అంటూ నవీన్ పోలిశెట్టి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో పాటుగా సంక్రాంతి బరిలో దిగిన నవీన్ పోలిశెట్టి సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఫ్యామిలీ వెడ్డింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించి సందడి చేశారు.

Also Read: Naveen polishetty: ఆ హీరో పెళ్లి జరిగిన మరుసటిరోజే నా పెళ్లి: నవీన్ పోలిశెట్టి

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×