E-Paper
Advertisement

Mega158 Launch: పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా158 లాంచ్… సంక్రాంతి 2027 టార్గెట్

Mega158 Launch: పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా158 లాంచ్… సంక్రాంతి 2027 టార్గెట్
Advertisement

Mega158 Launch: మన శంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరు తాజాగా మరో సినిమాకి ముహుర్తం పెట్టేశాడు. యస్ ..వాల్తేరు వీరయ్య లాంటి సాలిడ్ హిట్ తర్వాత బాబీ మరోసారి చిరుతో చేయబోయే మెగా158 సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైనట్టు తెలుస్తుంది.

ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 

Advertisement

హైదరాబాద్‌లోని KVN ప్రొడక్షన్స్ ఆఫీస్‌లో ఈ సినిమా ఓపెనింగ్ కన్నుల పండగగా జరగగా ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిరంజీవిపై క్లాప్ కొట్టడం కొట్టడం విశేషం. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాను KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో నిలపాలని బాబీ ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే బాబీ – చిరు కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.సో .. అదే సెంటిమెంట్‌ను ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారన్న మాట.అయితే ఇదే పొంగల్ బరిలో అనిల్ – వెంకీ సినిమా కూడా వస్తున్న సంగతి తెల్సిందే.మరి వచ్చే పొంగల్ దంగల్ లో చిరు – వెంకీల మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి.

మొదటి షెడ్యూల్‌లో చిరంజీవి పై సోలో ఎంట్రీ సీన్స్‌

Advertisement

ఇక మొదటి షెడ్యూల్‌లో భాగంగా చిరంజీవి పై సోలో ఎంట్రీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారని ఆ తర్వాత వెంటనే ఓ మాస్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, మలయాళ స్టార్ మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్, బండ్ల గణేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ ఎక్కడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి.

మొత్తానికి పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒక గ్లోబల్ హైప్ వచ్చేసిందన్నది నిజం . మరి ‘వాల్తేరు వీరయ్య’ మ్యాజిక్‌ను బాబీ మళ్లీ రిపీట్ చేస్తారా? సంక్రాంతి బరిలో చిరు మళ్లీ విన్నర్‌గా నిలుస్తారా? అనేది కాలమే డిసైడ్ చేయాలి !

also read:Swayambhu: ఓటీటీ డీల్ అటకెక్కిందా? డైలమాలో స్వయం భూ రిలీజ్ ..

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×