E-Paper
Advertisement

MSVPG: 500 మంది డ్యాన్సర్స్ తో చిరు ,వెంకీ పవర్ ఫుల్ సాంగ్..రంగంలోకి స్టార్ కొరియోగ్రాఫర్!

MSVPG: 500 మంది డ్యాన్సర్స్ తో చిరు ,వెంకీ పవర్ ఫుల్ సాంగ్..రంగంలోకి స్టార్ కొరియోగ్రాఫర్!
Advertisement

MSVPG: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi)నయనతార(Nayanatara) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”(MSVPG). ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్ ఎలాంటి ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయని సమాచారం.

500 డాన్సర్లతో సాంగ్ షూటింగ్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో వెంకటేష్ చిరంజీవి మీద ఒక సాంగ్ షూటింగ్ జరగబోతోందని తెలుస్తుంది . ఈ ఇద్దరు కలిసి ఈ పాటలో కనిపించబోతున్నారు ఈ పాట సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఏకంగా 500 మంది డాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం కోసం విజయ్ పోలకి మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారని సమాచారం. ఇలా విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటేనే ఈ పాట పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇది వరకు విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ దర్శకత్వంలో నాదీ నక్కలీసు గొలుసు అనే పాట ఎలాంటి సక్సెస్ అయ్యిందో తెలిసిందే.

22 నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర..

Advertisement

పుష్ప సినిమాలో ఊ అంటావా మావ అనే పాటకు కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఇలాంటి సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ అందించిన మాస్టర్ చేత చిరంజీవి వెంకటేష్ కాంబోలో ఒక సాంగ్ రాబోతుంది అంటేనే ఈ పాటపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సాంగ్ చిత్రీకరణ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర సుమారు 22 నిమిషాల వరకు ఉంటుందని ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఓ సందర్భంలో వెల్లడించారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఓకే సినిమాలో కలిసి కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిరు మూవీ..

Advertisement

ఇక వెంకటేష్ ఇదివరకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై కూడా అలాగే అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించబోతుందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 20 సంవత్సరాలు తర్వాత చిరంజీవి ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Also Read: Toxic Teaser: టాక్సిక్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్…మరో విధ్వంసానికి రెడీ అవుతున్న యశ్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×