E-Paper
Advertisement

Hyderabad News: మెస్సితో పుట్‌బాల్ మ్యాచ్.. సీఎం రేవంత్‌రెడ్డి ముమ్మరంగా ప్రాక్టీసు, ఆశ్చర్యపోయిన ప్లేయర్స్

Hyderabad News: మెస్సితో పుట్‌బాల్ మ్యాచ్.. సీఎం రేవంత్‌రెడ్డి ముమ్మరంగా ప్రాక్టీసు, ఆశ్చర్యపోయిన ప్లేయర్స్
Advertisement

Hyderabad News: సాకర్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్‌‌‌‌ టూర్‌పై ఆసక్తి మొదలైంది. ‘గోట్ ఇండియా టూర్‌‌‌‌’‌‌‌‌లో భాగంగా మెస్సీ భాగ్యనగరానికి రానున్నాడు. డిసెంబర్ 13న ఉప్పల్‌‌‌‌ స్టేడియం వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో మెస్సీ ఆడనున్నాడు. ఆయనతో తలపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. అందుకోసం ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నారు.

ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రాక్టీసులో సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

ఆదివారం రాత్రి సెక్రటేరియట్‌లో సమావేశం తర్వాత MCHRD‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. బిజీ షెడ్యూల్‌లో ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి యాక్టివ్‌గా రన్నింగ్ చేస్తూ మైదానంలో మ్యాచ్ ఆడిన తీరుని చూసి రెగ్యులర్ ప్లేయర్లు ఆశ్చర్యపోయారు. సుమారు గంటసేపు ప్రాక్టీసులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్‌‌‌‌లో మెస్సీ టీమ్‌‌‌‌తో మరో జట్టు తలపడనుంది. ఆ టీమ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యం వహించే అవకాశముంది. ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌9 జెర్సీతో బరిలోకి దిగనుంది సీఎం టీమ్. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఫుల్‌‌‌‌బాల్ ఆటగాళ్లు ఆడుతారని సమాచారం.

Advertisement

మెస్సితో మ్యాచ్ కోసం ముమ్మరంగా సాధన

సాకర్ ప్లేయర్ మెస్సీతో తలపడే ఈ మ్యాచ్‌‌‌‌లో సెంటర్ ఫార్వర్డ్ పొజిషన్‌‌‌‌లో ముఖ్యమంత్రి ఆడతారని తోటి ఆటగాళ్లు చెబుతున్నారు. ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ గేమ్ ఎంతగానో ఇష్టపడతారు రేవంత్‌రెడ్డి. మెస్సీతో మ్యాచ్ కోసం బిజీ షెడ్యూల్‌‌‌‌లో రాత్రి వేళ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ఫోటో కూడా అందులోనిది.

ALSO READ:  ప్రజా పాలనకు రెండేళ్లు.. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ శ్రీకారం

సెలబ్రిటీల మ్యాచ్‌తో హైదరాబాద్ స్పోర్ట్స్ స్పిరిట్‌ను హైలైట్ చేశారు. తెలంగాణ రైజింగ్‌లో క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రకరకాల చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. మెస్సీ పర్యటన గురించి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరోవైపు మెస్సీ టూర్ ఏర్పాట్లను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.

 

CM Revanth Reddy ready to exhibition football match with Messi
CM Revanth Reddy ready to exhibition football match with Messi

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×