E-Paper
Advertisement

National Herald Case: గాంధీ కుటుంబానికి బిగించిన ఉచ్చు: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు..

National Herald Case: గాంధీ కుటుంబానికి బిగించిన ఉచ్చు: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు..
Advertisement

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై FIR నమోదైంది. ఈ కీలక పరిణామంతో ప్రస్తుత రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి క్రిమినల్ కుట్ర అభియోగాలు నమోదు చేశారు.

తాజా FIRలో శ్యామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తులు…
మరో ఆరుగురిపైనా ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కొత్త FIR నమోదు చేసింది. ED ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్‌ 3న FIR నమోదు చేశారు. తాజా FIRలో శ్యామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తులు సహా… అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్, డొటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 కంపెనీల పేర్లు ఉన్నాయి.

Advertisement

క్రిమినల్ కుట్ర జరిగిందనే ఆరోపణలతో FIR నమోదు
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే మాతృసంస్థ AJLను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి… క్రిమినల్ కుట్ర జరిగిందనే ఆరోపణలతో FIR నమోదైంది. కోల్‌కతాలో ఉన్నట్లు ఆరోపిస్తున్న డొటెక్స్ మర్చండైజ్ అనే షెల్ కంపెనీ నుంచి యంగ్ ఇండియన్ అనే కంపెనీకి… కోటి రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సోనియా, రాహుల్‌కు కలిపి 76 శాతం వాటా..
యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్‌కు కలిపి 76 శాతం వాటా ఉంది. కోటి రూపాయల లావాదేవీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి యంగ్ ఇండియన్ కంపెనీ 50 లక్షలు చెల్లించి.. సుమారు రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఏజేఎల్‌పై నియంత్రణ సాధించిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.

Advertisement

ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్
ఈ కేసు విషయమై కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ స్పందించారు. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంపై నిరంతరం బెదిరింపులు, రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: కాచిగూడ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్.. డివైడర్‌ని ఢీకొన్న బైక్, ఆపై స్పాట్‌లో

చివరికి న్యాయమే గెలుస్తుంది..
అభద్రత, భయంతో ఉన్నవారు మాత్రమే ఇతరులను బెదిరించడానికి ప్రయత్నిస్తారని అన్నారు. చివరికి న్యాయమే గెలుస్తుందని.. సత్యమేవ జయతే అంటూ ఆయన ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థలు తీసుకుబోయే తదుపరి చర్యలు ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది.

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×