E-Paper
Advertisement

Vishwambhara: విశ్వంభరకి లైన్ క్లియర్.. చిరంజీవి టాలెంట్ మామూలుగా లేదుగా?

Vishwambhara: విశ్వంభరకి లైన్ క్లియర్.. చిరంజీవి టాలెంట్ మామూలుగా లేదుగా?
Advertisement

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ).. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బుక్ మై షో లో అధిక టికెట్లు అమ్ముడుపోతున్న సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా ఇటు ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో అటు విశ్వంభర మూవీకి లైన్ క్లియర్ అయింది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

టీజర్ తో డీలా పడిపోయిన ఫ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ తర్వాత ఆయన ప్రకటించిన చిత్రం విశ్వంభర. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తరహా ఫాంటసీ కథతో చేయడానికి ఈ సినిమా సిద్ధం అవడం, మరోవైపు అనౌన్స్మెంట్ పోస్టర్ క్రేజీగా ఉండడం.. పైగా యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అంతబాగున్న టైమ్ లో ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ఒక్కసారిగా ఆడియన్స్ మాత్రమే కాదు అభిమానులు కూడా డీలా పడిపోయేలా చేసింది. ముఖ్యంగా టీజర్ మీద విపరీతమైన ట్రోల్స్ రావడంతో టీం కూడా కంగారు పడిపోయింది.

విశ్వంభరకి లైన్ క్లియర్ అయినట్టేనా?

Advertisement

అందుకే సినిమాను ముందుగా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయకుండా వెనక్కి తగ్గింది చిత్ర బృందం. ఇక ఈ ఏడాది ఈ సంక్రాంతికి సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఈ సంక్రాంతికి కూడా రాలేదు. పైగా వేసవికి వాయిదా వేశారు. ఇకపోతే ఈ వేసవికైనా సినిమా వస్తుందా అనే అనుమానాలు అభిమానులలో ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి లాంగ్ డిలేయ్డ్ మూవీస్ కి తగ్గిన హైప్ ను మళ్లీ పెంచడం అనేది అంత తేలికైన పని కాదు. మరోవైపు దీని తర్వాత మొదలైన మన శంకర వరప్రసాద్ గారు దీనికంటే ముందు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించే దిశగా దూసుకు వెళ్తోంది అని చెప్పవచ్చు..

ALSO READ:Anaganaga oka Raju: అనగనగా ఒక రాజు ఓటీటీ,టీవీ పార్టనర్ ఫిక్స్!

చిరంజీవి టాలెంట్ కి ఫ్యాన్స్ ఫిదా..

Advertisement

ముఖ్యంగా ఈ విషయంలో చిరంజీవి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా అంటే.. విశ్వంభర సినిమాను పట్టుకొని వేలాడితే కుదరదని, అందుకే ఆ సినిమాను పక్కనపెట్టి మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేశారు. ఈ సినిమా ఒకవేళ మంచి విజయం సాధిస్తే.. విశ్వంభర సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయాల్సి ఉండదు.. అనే కోణంలోనే ఆయన ఆలోచించి విశ్వంభరను కాస్త పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన అనుకున్నట్లుగానే మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో విశ్వంభర సినిమాకి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా విశ్వంభర రాబోతోంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా జాగ్రత్తగా పనిచేసి బెటర్ ఔట్పుట్ తీసుకొస్తే మాత్రం చిరు ఖాతాలో మరో అతిపెద్ద హిట్ పడే అవకాశం కూడా కనిపిస్తోంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×