Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara).హీరోయిన్ గా, విక్టరీ వెంకటేష్(Venkatesh ) కీలకపాత్రలో వచ్చిన ఈ సినిమా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి(Bobby kolli) దర్శకత్వంలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్ మాఫియా డాన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా అభిమానులలో అంచనాలు పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా చిరంజీవి నుంచి ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం విశ్వంభర. ఈ మూవీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పుడో గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గత ఏడాది డిసెంబర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ విఎఫ్ఎక్స్ విమర్శలు ఎదుర్కోవడంతో చిత్ర బృందం విడుదల తేదీని వాయిదా వేసింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పై రీ వర్క్ కొనసాగిస్తున్నారు. ఎలాగైనా సరే ప్రేక్షకులకు విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని అందించాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.
అద్భుతమైన విజువలైజేషన్ తో ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందించడానికి చిరంజీవి అటు చిత్ర బృందం భారీగా కష్టపడుతున్నారు . ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి చేసిన మాస్టర్ ప్లాన్ అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మరి ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 30వ తేదీన రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ సినిమాతో పాటు థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ డబుల్ ట్రీట్ మెగా అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ నిర్ణయం తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పుడు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికైతే పెద్ది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా సమయంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయన ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం ఎ
ఇన్ని రోజులు వాయిదా పడ్డ విశ్వంభర.. కొత్త ఊపిరి పోసుకుంటుంది అనడంలో సందేహం లేదు.
విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, త్రిష కాంబినేషన్లో తెలుగు సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి , విక్రమ్ రెడ్డి నిర్మిస్తూ ఉండగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. పైగా చిరంజీవి కీరవాణి కాంబినేషన్లో వస్తున్న నాలుగవ చిత్రం కావడంతో అటు మ్యూజిక్ పరంగా కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
also read: Trisha – Vijay: త్రిష ప్రేమించింది విజయ్ ను కాదా.. ప్రత్యర్ధులకు పిడుగు లాంటి వార్త చెప్పిన సింగర్ !