E-Paper
Advertisement

Crime thriller OTT: మెంటలెక్కించే మర్డర్ కేసు… ఇరగదీసే ఇన్వెస్టిగేషన్…ట్విస్టులు మాత్రం బోలెడు

Crime thriller OTT: మెంటలెక్కించే మర్డర్ కేసు… ఇరగదీసే ఇన్వెస్టిగేషన్…ట్విస్టులు మాత్రం బోలెడు
Advertisement

Crime thriller OTT : డిజిటల్ స్ట్రీమింగ్ కి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జోనర్ సినిమాలన్నీ ఎక్కువగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మర్డర్ మిస్టరీ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్స్ ఆఫీస్ వద్ద కూడా విజయవంతమైంది. అమెరికన్ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యల గురించి అవగాహన కల్పించేందుకు దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒక హత్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. ఇది ఒక రియల్ స్టోరీ కూడా.

ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్

టేలర్ షెరిడాన్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘విండ్ రివర్’ (Wind River). ఈ చిత్రంలో జెరెమీ రెన్నర్, ఎలిజబెత్ ఒల్సేన్ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు వ్యోమింగ్ లోని విండ్ రివర్ పై జరిగిన హత్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. గిల్ బర్మింగ్ హామ్, జాన్ బెర్న్తాల్, గ్రాహం గ్రీన్ కూడా ఇందులో నటించారు. విండ్ రివర్ 2017 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. 2017 ఆగస్టు 4న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది కూడా. $11 మిలియన్ల బడ్జెట్‌తో పోలిస్తే $45 మిలియన్లు వసూలు చేసింది. దీనిని ది వైన్‌స్టీన్ కంపెనీ థియేటర్లలో విడుదల చేసింది. కానీ అక్టోబర్ ప్రస్తుతం ఈ సినిమా prime videoఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే    

Advertisement

ఈ సినిమా స్టోరీ చాలా ఎమోషనల్‌గా, థ్రిల్లింగ్‌గా సాగుతుంది. వ్యోమింగ్ అనే మంచు ప్రాంతంలోని’విండ్ రివర్ అనే చోట, ఒక అమ్మాయి శవం గడ్డకట్టిన స్థితిలో దొరుకుతుంది. ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి ఎఫ్‌బీఐ ఏజెంట్ జేన్ బ్యానర్ వస్తుంది. కానీ ఆ ప్రాంతంలోని చలి, అక్కడి పరిస్థితులు ఆమె బాగా ఇబ్బంది పడుతుంది. దాంతో ఆమెకు సహాయం చేయడానికి స్థానిక ట్రాకర్ అయిన కోరీ లాంబర్ట్ రంగంలోకి దిగుతాడు. అతనికి ఆ అడవులు, మంచు కొండల గురించి బాగా తెలుసు. పైగా గతంలో తన కూతురిని కూడా ఇలాగే కోల్పోయి ఉండటంతో, ఆ బాధతో ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటాడు.

ఇక వీళ్ళిద్దరూ కలిసి దర్యాప్తు చేస్తుంటే, ఆ అమ్మాయి హత్య వెనుక ఉన్న దారుణమైన నిజాలు బయటపడతాయి. ముఖ్యంగా ఆ రిజర్వేషన్ ఏరియాలో పనిచేసే కొంతమంది కిరాతకులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో తెలుస్తుంది. మంచులో పరుగెత్తుతూ, శ్వాస ఆగిపోయేంత చలిలో ఆ అమ్మాయి పడ్డ కష్టం చూస్తే గుండె బరువెక్కుతుంది. చివరికి ఆ నేరస్తులను వీళ్ళు ఎలా పట్టుకున్నారు ? వాళ్ళకి శిక్ష పడిందా ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : యజమానికి చుక్కలు చూపించే రోబో… అబ్బురపరిచే విజువల్స్… ఐయండిబిలో టాప్ రేటింగ్ కూడా

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×