E-Paper
Advertisement

Mana Shankara Varaprasad Gaaru : భీమ్స్ చేసిన పనికి మెగాస్టార్ మూవీ షూటింగు క్యాన్సిల్?

Mana Shankara Varaprasad Gaaru : భీమ్స్ చేసిన పనికి మెగాస్టార్ మూవీ షూటింగు క్యాన్సిల్?
Advertisement

Mana Shankara Varaprasad Gaaru : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన మీసాల పిల్ల అనే పాట విపరీతమైన రెస్పాన్స్ సాధించింది. దాదాపు 50 మిలియన్స్ పైగా ఆ పాటకు న్యూస్ వచ్చాయి.

ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించడానికి ఏమి చేయాలో అనే క్లారిటీ అనిల్ రావిపూడి కి చాలా బాగా ఉంది. అందుకే అతను చేసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. కొంతమంది అనిల్ ను మినీ రాజమౌళి అని కూడా అంటారు. అనిల్ దర్శకుడిగా ఏ నిర్మాత అయిన సినిమా చేస్తే అతను 100% సేఫ్ అని అందరికీ ఒక స్థాయి నమ్మకం కూడా వచ్చేసింది.

భీమ్స్ పనికి షూటింగ్ కి క్యాన్సిల్ 

Advertisement

అనిల్ నుంచి చివరగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాకి మంచి హైప్ రావడానికి కారణం ఈ సినిమా నుంచి విడుదలైన గోదారి గట్టు పైన రామచిలకవే అనే పాట. రమణ గోగుల పాడిన ఈ పాట అప్పట్లో టాప్.

అదే మాదిరిగానే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కూడా పాటను డిజైన్ చేశారు. ఈ పాట కూడా సూపర్ హిట్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో మరొక సాంగ్ కూడా సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఈరోజు జరగాల్సి ఉంది. కానీ భీమ్స్ ఇచ్చిన ట్యూన్ తో అనిల్ రావిపూడి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదట అందుకోసమే ఈరోజు జరగాల్సిన షూటింగ్ కూడా క్యాన్సిల్ చేశారు అని సమాచారం వినిపిస్తుంది.

హైయెస్ట్ కలెక్షన్స్ వస్తాయా?

Advertisement

అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. కొంతమందికి యూత్ కి మాత్రం ఈ సినిమాలు పెద్దగా ఎక్కవు. అయితే మెగాస్టార్ కోసం సినిమాకి వచ్చే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ల కలెక్షన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఎలానో ఆ సినిమాను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కి వస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి మళ్ళీ అద్భుతమైన కలెక్షన్స్ మెగాస్టార్ సినిమాకు వస్తాయి అని చాలామంది అంచనా వేస్తున్నారు.

Also Read: Raju Weds Ramabai : ఇది లోకానికి తెలియాల్సిన కథ… పగోనికి కూడా జరగకూడదు. 

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×