E-Paper
Advertisement

Lalo Movie : 50 లక్షలతో సినిమా నిర్మిస్తే… 60 కోట్ల లాభం వచ్చింది

Lalo Movie : 50 లక్షలతో సినిమా నిర్మిస్తే… 60 కోట్ల లాభం వచ్చింది

Lalo Movie: సినిమా అంటే ఇటీవల కాలంలో వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున విఎఫ్ఎక్స్ ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా వందల కోట్ల ఖర్చుపెట్టి ప్రేక్షకుల ముందుకు సినిమాలను తీసుకువచ్చిన కనీసం పెట్టుబడిని కూడా రాబట్ట లేకపోయినాసినిమాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద ఎత్తున స్టార్ సెలబ్రిటీలు భాగమైన సినిమాలకు అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాదు. సినిమాకు సక్సెస్ అనేది మనం పెట్టిన బడ్జెట్ కాదని సినిమాలో సత్తా ఉంటే సినిమా కథ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని ఎన్నో చిన్న సినిమాలు నిరూపించాయి.

రూ. 60 కోట్ల కలెక్షన్లతో సంచలనాలు..

ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిలో గుజరాతి చిత్రం “లాలో- కృష్ణ సదా సహాయం” (Lalo krishna sada sahaayate) సినిమా ఒకటి.అంకిత్ సఖియా(Ankit Sakhiya) దర్శకత్వంలో కరణ్ జోషి(Karan Joshi) , రీవా రాచ్ , శ్రుహద్ గోస్వామి, అన్షు జోషి మరియు కిన్నాల్ నాయక్ వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు. అక్టోబర్ 10వ తేదీ విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ రన్ తో కొనసాగుతోంది. ఈ సినిమా కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇలా 50 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 60 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించింది.

రిక్షా డ్రైవర్ నేపథ్యంలో..

ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహించలేదు కేవలం కథలో అద్భుతమైన కంటెంట్ ఉండటం వల్ల మౌత్ టాక్ ద్వారానే ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఇక ఈ సినిమా మొత్తం రిక్షా డ్రైవర్ చుట్టూ కొనసాగుతోంది. ఇలా రిక్షా డ్రైవర్ కథ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకొని ఇప్పటికి విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితం అవుతుంది. ఈ సినిమా విడుదలైన మొదటివారం కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపించకపోయిన ఆ తరువాత మౌత్ టాక్ ద్వారా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టడంతో ట్రేడ్ వర్గాల నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మౌత్ టాక్ ద్వారా బ్లాక్ బస్టర్..

ఇలా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే కథలతో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తేనే చిత్ర పరిశ్రమ మరింతకాలం విజయవంతంగా ముందుకు సాగుతుందని పలువురు ఈ సినిమా కలెక్షన్ల పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో దర్శక నిర్మాతలు కంటెంట్ కంటే కూడా బడ్జెట్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తమ సినిమాకు ఇంత బడ్జెట్ అయింది అని చెప్పుకోవడం కోసమే అనవసరపు ఖర్చులు చేస్తూ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా కథలో దమ్ము లేకపోతే ఎన్ని వేల కోట్లు పెట్టిన అలాంటి సినిమాలకు ప్రేక్షకాదరణ కరువు అవుతుందని చెప్పాలి. మరి ఈ సినిమా 60 కోట్లతో ఆగుతుందా లేదంటే మరింత కలెక్షన్లను రాబడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Keerthy Suresh: చాలా బాధగా ఉంది.. ఏఐ మార్ఫింగ్ ఫోటోపై కీర్తి సురేష్ ఆవేదన!

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×