E-Paper
Advertisement

Raju Weds Ramabai : మూవీ హిట్ అవ్వకపోతే.. అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా… డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్

Raju Weds Ramabai : మూవీ హిట్ అవ్వకపోతే.. అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా… డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్
Advertisement

Raju Weds Ramabai : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది రీసెంట్ టైమ్స్ లో తమ కథలను చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఊహాత్మకంగా కథలను ఆలోచించకుండా వాళ్లు చూసిన పరిస్థితులను వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ సినిమాలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచిగానే వర్కౌట్ అవుతున్నాయి.

రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు దర్శకుడు సాయిలు కంపాటి. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సాయిలు కంపాటి ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చారు. వేణు అడుగుల ఈ సినిమాని నిర్మించారు.

నాకు ఇవి మాత్రమే తెలుసు

Advertisement

ఈ సినిమాని తక్కువ చేసిన వాళ్లకు ఒకటే చెప్తా. నేను ఊరోడ్ని, ఊరు కథలే రాస్తా, నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన ఊరు నేను చూసిన మట్టి మనుషులు. పొలాల్లో నాటేసి మనుషులు, నాగలి పట్టుకుని దారిని నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా ఉండే అమ్మాయిలు. వాళ్ల మధ్య పుట్టే మొదటి ప్రేమ. నాకు ఇవే తెలుసు.

నేను హెలికాప్టర్ నుంచి దిగొచ్చే హీరోను మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చే హీరోని రాయలేను. ఎందుకంటే నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా నేను ఇదే తీస్తా. ఎందుకంటే కేవలం నాకు ఇవే వచ్చు. నేను ఒక కొత్త కథను చెప్పడానికి వచ్చు. నాదొక చిన్న బతుకు, ఊర్లోకి వెళ్లి వచ్చి ఒక చిన్న కథ రాసి సినిమా చేశా.

బట్టలిప్పి తిరుగుతా

Advertisement

ఈ సినిమాకి సంబంధించి నెగటివ్ ప్రచారం చేయకండి అన్న. 15 ఏళ్లు నరకం చూపించిన ఒక కథని, అలా చేసిన కొంతమంది మనుషుల్ని, నేనేదో బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కథ చెబుదామనుకుంటే. ఓకే అన్న మీకు నచ్చలేదు చలో లైట్ తీసుకో, కానీ నెగిటివ్ ప్రచారం మాత్రం చేయకండి.

చిన్న సినిమా కానీ నేను ఒక పెద్ద ఎమోషన్ చెబుదామని అనుకుంటున్నాను. సారీ అన్నా మిమ్మల్ని హర్ట్ చేస్తే ఈ సినిమా మమ్మల్ని క్షమించండి. దయచేసి నెగిటివ్ టాక్ తీసుకురావద్దు. సినిమా 21వ తారీకు గనక నెగిటివ్ టాక్ తీసుకొస్తే, అమీర్పేట్ సెంటర్ ఉంది కదా అక్కడ కట్ డ్రాయర్ మీద ఉరుకుతా అని సాయిలు కంపాటి తన స్పీచ్ లో చెప్పారు. ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా అంటే అర్థం చేసుకోండి.

మీరు ఊరోలైతే మీరు ఆ ఊర్లోకి వెళ్తారు. సంక్రాంతికి దసరాకి పోయినట్టు మీరు ఆ ఊర్లో ఉంటారు అది గుర్తుపెట్టుకోండి. అరే ఇది మా ఊరు, ఇది నా పిల్ల, వీళ్లు మా ఫ్రెండ్స్ అనేంత ఎమోషన్ ఉంటుంది సినిమాలో. 21వ తారీకు సినిమా విడుదలవుతుంది దయచేసి చూడండి అంటూ మాట్లాడారు.

Also Read: SKN: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నిర్మాత, మహేష్ బాబు అభిమాని కుటుంబానికి 2లక్షలు

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×