E-Paper
Advertisement

Chiranjeevi Viswanath: ఆ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు.. నిర్మాత ఏడిద శ్రీరామ్

Chiranjeevi Viswanath: ఆ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు.. నిర్మాత ఏడిద శ్రీరామ్
Advertisement

Chiranjeevi Viswanath: తెలుగు సినిమా చరిత్రలో కె. విశ్వనాథ్, చిరంజీవిల కాంబినేషన్ ఒక అద్భుతం. వీరి కలయికలో వచ్చిన ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ చిత్రాలు నటుడిగా చిరంజీవి స్థాయిని శిఖరాగ్రానికి చేర్చాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎడిద శ్రీరామ్, ఈ సినిమాల వెనుక ఉన్న కొన్ని తెలియని విషయాలను వెల్లడించారు. వందల కోట్ల కలెక్షన్లు, కోట్లాది మంది అభిమానులు ఉన్న మెగాస్టార్ చిరంజీవి, విశ్వనాథ్ గారి ముందు మాత్రం ఒక చిన్న పిల్లాడిలా ఉండేవారని శ్రీరామ్ గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటే, చిరంజీవి ఆయనకు అంతరాయం కలిగించకుండా చేతులు కట్టుకుని దూరంగా నిలబడి వేచి చూసేవారట. “ఆయన కంఫర్ట్ చూసుకుని, ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాతే చిరంజీవి గారు దగ్గరకు వెళ్లేవారు. అంతటి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఆయన సొంతం” అని శ్రీరామ్ కొనియాడారు.

Read also-Lil Poppa: అమెరికన్ యంగ్ రాపర్ ‘లిల్ పాపా’ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘స్వయంకృషి’ కోసం సాహసం

Advertisement

‘స్వయంకృషి’ సినిమా చేసే నాటికి చిరంజీవి ‘సుప్రీమ్ స్టార్’గా మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. అప్పుడు ఒక చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రను ఆయనకు చెప్పడానికి విశ్వనాథ్ గారు కొంత సంకోచించారు. మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఈ పాత్రకు ఒప్పుకుంటారా? అని సందేహించారు. కానీ కథ విన్న తర్వాత చిరంజీవి ఏమాత్రం తడబడకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఆ పాత్ర సహజంగా రావడం కోసం స్వయంగా చెప్పులు కుట్టడం నేర్చుకున్నారు. ఒక స్టార్ హీరో గ్లామర్‌ను వదిలేసి అంతటి డీ-గ్లామరైజ్డ్ పాత్ర చేయడం అప్పట్లో ఒక సంచలనం.

Read also-CULT Teaser: విశ్వక్ సేన్ దర్శకుడిగా వస్తున్న ‘కల్ట్’ టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

నటనలో ప్రతిభ

Advertisement

విశ్వనాథ్ గారు చిరంజీవి, కమల్ హాసన్ వంటి గొప్ప నటుల గురించి ఒక మాట అనేవారట.. అది ఏంటంటే.. “మనం ఒక పునాది వేస్తే, వారు దానిపై అందమైన భవనాన్ని నిర్మిస్తారు”. అంటే దర్శకుడు పాత్ర స్వభావాన్ని చెబితే, నటులు తమ ప్రతిభతో ఆ పాత్రకు ప్రాణం పోస్తారని అర్థం. ఉదాహరణకు ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో పిచ్చాసుపత్రి సీన్‌లో అద్దం ముందు తనని తాను తిట్టుకునే సన్నివేశాన్ని చిరంజీవి గారు స్వయంగా మెరుగుపరిచి అద్భుతంగా పండించారు. అది చూసి విశ్వనాథ్ కూడా ముగ్ధులయ్యారు. చిరంజీవి విజయం వెనుక కేవలం అదృష్టం మాత్రమే లేదు, ఆయన పడే కష్టం, నేర్చుకోవాలనే తపన గురువుల పట్ల ఉన్న అపారమైన గౌరవం ఉన్నాయని ఎడిద శ్రీరామ్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఎన్ని శిఖరాలు అధిరోహించినా ఒదిగి ఉండే చిరంజీవి గారి స్వభావమే ఆయనను నిజమైన మెగాస్టార్‌ను చేసింది.

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×