E-Paper
Advertisement

Solar AC in India: సోలార్ ఏసీ వల్ల లాభాలేమిటీ? ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా!

Solar AC in India: సోలార్ ఏసీ వల్ల లాభాలేమిటీ? ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా!
Advertisement

Solar AC in India: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలో ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు మార్చి నెలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఏసీలను ఆశ్రయిస్తున్నారు. అయితే చాలా మంది రెగ్యులర్ ఏసీలు కొనుగోలు చేస్తుంటే మరికొందరు మాత్రం సోలార్ ఏసీలపై దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోలార్ ఏసీలకు సంబంధించిన లాభ నష్టాలు? అవి ఏవిధంగా పనిచేస్తాయి? ధర వివరాలు? వంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సోలార్ ఏసీలు ఎలా పనిచేస్తాయి?

సోలార్ ఏసీలు ఇంటి పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్స్ కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ ప్యానెల్స్ సూర్యరశ్మిని విద్యుత్ శక్తిగా మార్చి ఏసీలోని కూలింగ్ వ్యవస్థ పనిచేసేలా సాయపడతాయి. ఈ ప్యానెల్స్ సాధారణంగా 1.5 టన్ ఏసీకి 1.5 – 3 kW సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎండ ఉన్న సమయంలో ఈ ఏసీలు.. సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకొని పనిచేస్తాయి. రాత్రి వేళల్లో లేదా దట్టమైన మేఘాలు కమ్ముకున్న సమయాల్లో దానంతట అదే గ్రిడ్ పవర్ కు మారిపోతుంది. గ్రిడ్ పవర్ కోసం సోలార్ ఏసీలకు బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు. ఇవి పగటి పూట సూర్య రశ్మిని సేకరించి దానిని సోలార్ పవర్ రూపంలో బ్యాటరీలో స్టోర్ చేస్తాయి.

సోలార్ ఏసీల వల్ల లాభాలేంటి?

Advertisement

సాధారణ ఏసీలతో పోలిస్తే సోలార్ ఏసీలు పర్యావరణ పరంగా, ఆర్థికపరంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పగటి పూట ఏసీ వాడకానికి అవసరమైన విద్యుత్ లో 50-90 శాతం సోలార్ నుంచే వినియోగించుకుంటుంది. తద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేస్తుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో సోలార్ ఏసీ ద్వారా నెలకు రూ.1500-3000 వరకూ ఆదా చేసుకోవచ్చు. మరోవైపు సాధారణ ఏసీలు రన్నింగ్ సమయంలో కర్బన ఉద్గారాలను గాలిలోకి విడుదల చేస్తాయి. వాటితో పోలిస్తే సోలార్ ఏసీలు పర్యావరణహితంగా పనిచేస్తాయి. మరోవైపు సోలార్ ఏసీలను కొనుగోలు చేస్తే పీఎం సూర్య ఘర్ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ సైతం ఇస్తోంది. అటు సాధారణ ఏసీలతో పోలిస్తే.. వీటి లైఫ్ టైమ్ చాలా ఎక్కువ. సోలార్ ప్యానెల్స్ 25 ఏళ్లకు పైగా పనిచేస్తాయి.

మరి నష్టాల సంగతేంటి?

సోలార్ ఏసీలకు లాభాలతో పాటు కొన్ని నష్టాలు సైతం ఉన్నాయి. సాధారణ ఏసీలతో పోలిస్తే ఇది 2-3 రెట్లు ఖరీదైనవి. సోలార్ ప్యానెల్స్ నిర్మాణం కోసం ఇంటి పైకప్పుపై 100-300 చదరపు అడుగుల స్థలం తప్పనిసరి. హైదరాబాద్ వంటి నగరాల్లో అపార్ట్ మెంటుల్లో జీవించే వారికి ఇది కష్టంగా మారవచ్చు. అలాగే శీతాకాలం, వర్షాకాలంలో సోలార్ ఏసీ పనితీరు గణనీయంగా మందగిస్తుంది. దీని వల్ల గ్రిడ్ బిల్ పెరిగిపోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ కూడా కొందరికి కష్టంగా అనిపించవచ్చు. మరోవైపు సోలార్ ప్యానెల్స్ ను 3-6 నెలలకు ఒకసారి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిపై దుమ్ము, దూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి  వస్తుంది. సాధారణ ఏసీలతో పోలిస్తే.. సోలార్ ఏసీల్లో కూలింగ్ కాస్త నెమ్మదిగా ఉంటుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: LG vs Samsung Fully Automatic: ఎల్జీ vs శాంసంగ్.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లలో.. ఫీచర్ల పరంగా దేనిది పైచేయి?

ధరల విషయానికి వస్తే..

సోలార్ ఏసీల ధరలు.. సైజు (1 లేదా 2 టన్), ప్యానెల్స్ సామర్థ్యం (1.5 – 3 kW), బ్యాటరీల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ లో రూ.1.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకూ (సబ్సిడీ లేకుండా) సోలార్ ఏసీలు పలుకుతున్నాయి. ఎక్కువ మంది వినియోగించే 1.5 టన్ ఏసీకి రూ. 1.5 – 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ లభిస్తే.. వాటి ఖరీదు రూ.80,000 నుంచి రూ.2 లక్షల వరకూ తగ్గుతుంది. సోలార్ ఏసీతో విద్యుత్ బిల్లు భారం గణనీయంగా తగ్గినప్పటికీ వీటి మెయింటెనెన్స్ కోసం ఏడాదికి రూ.5,000 – 10,000 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Also Read: Best Ceiling Fans 2026: ఏఐతో పనిచేసే స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్స్.. ఈ సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్.. ఏమున్నాయ్ బాసు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×