E-Paper
Advertisement

Vishwambhara: చిరంజీవి చేతులు దాటిపోతున్న విశ్వంభర?

Vishwambhara: చిరంజీవి చేతులు దాటిపోతున్న విశ్వంభర?

Vishwambhara: మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తున్నా.. సోషియో ఫాంటసీ చిత్రాలు ఇష్టపడే అభిమానులకి మాత్రం ‘విశ్వంభర’ వైపే చూపు.. నిజానికి గత ఏడాదే విడుదల కావలసిన ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కి వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్.. సినిమా విడుదల వాయిదాకు కారణం అనే చెప్పాలి. నాసిరకపు వీఎఫ్ఎక్స్ ఉపయోగించారనే వార్తలు బలంగా వినిపించడంతో ఎలాగైనా సరే అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలనే నేపథ్యంలో.. కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఈ సినిమా చిరంజీవి చేయి దాటిపోతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అభిమానుల చూపు విశ్వంభర వైపే..

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నారు. 375 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తనకు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన బాబీతో బెంగాల్ మాఫియా డాన్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా.. మరోవైపు తాను విడుదల చేయాల్సిన విశ్వంభర సినిమాకి సర్వం సిద్ధం చేస్తున్నారు చిరంజీవి. పైగా అంజి మూవీ తరహా విజువల్ వండర్ తో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

మొత్తం రీ వర్క్.. నిర్మాతకు భారీ నష్టం..

ఇక అందులో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయడంతో చాలామంది అమీర్పేట గ్రాఫిక్స్ తో లాగించేశారా ఏంటి? అని ట్రోల్స్ చేశారు. టీజర్ లోని గ్రాఫిక్స్ క్వాలిటీని చూసి సోషల్ మీడియా నుంచి వచ్చిన ట్రోల్స్ ను చిత్ర బృందం సీరియస్గా తీసుకుంది. అప్పటినుంచి గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేసి కొత్త గ్రాఫిక్స్ కంపెనీకి షిఫ్ట్ అయ్యారు. అలా విఎఫ్ఎక్స్ షార్ట్స్ మొత్తం రీ వర్క్ చేశారు.. దీనివల్ల నిర్మాతకు రెట్టింపు ఖర్చయింది .ఏ నిర్మాత అయిన సినిమాలకు బడ్జెట్ ను ఫైనాన్షియర్ నుండే తీసుకొస్తారు. అలాగే ఈ సినిమాకి కూడా చేశారు. ఇక సినిమా విడుదల ఆలస్యం అవుతూ రావడంతో అటు వడ్డీలు కూడా పెరిగిపోయి ఎవరు ఊహించనంత బడ్జెట్ పెరిగిపోయిందట.

also read:Roslin: స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మీనా సైకాలజికల్ సిరీస్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

హద్దులు దాటిన బడ్జెట్..

ఈ చిత్రానికి దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయితే అందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే 130 కోట్లు కేటాయించినట్లు సమాచారం. పైగా మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ కూడా 75 కోట్ల వరకు ఉందని.. ఇక ఇతర కాస్టింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇలా అన్నీ కలుపుకొని 250 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. అయితే మెగాస్టార్ కి ఉన్న మార్కెట్ ను బట్టి చూస్తే ఇది అంత లేదనే చెప్పాలి. ఇటు మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి కూడా 180 కోట్ల షేర్ లభించింది. అంత పెద్ద సూపర్ హిట్ సినిమాకే అంత షేర్ వసూలు వస్తే పాతబడిపోయిన ఈ విశ్వంభరా చిత్రానికి 250 కోట్ల షేర్ థియేటర్స్ నుంచి రావడం సాధ్యమవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

చిరంజీవి కాపాడుకుంటారా?

అటు ఓటీటీలు కూడా ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో విడుదలైన తర్వాత ఆ సినిమా ఫలితాన్ని ఆధారంగా తీసుకొని మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. మొత్తానికైతే ఈ విశ్వంభర ఇప్పుడు బడ్జెట్ విషయంలో చిరంజీవి నుండి చేజారిపోతోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రాబట్టాలి అంటే ఆడియన్స్ను విశేషంగా ఆకర్షించాలి. ఈ చిత్రం నుండి వచ్చే ప్రతి కంటెంట్ వేరే లెవెల్ లో ఉండాలి. అప్పుడే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది. మరి చూద్దాం చిరంజీవి ఈ చిత్రాన్ని ఎలా కాపాడుకుంటారో.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×