E-Paper
Advertisement

Mahabubabad News: స్మశానంలో ఎన్నికల ప్రచారం.. ఓటర్ల లిస్టులో చనిపోయిన వ్యక్తుల పేర్లు..

Mahabubabad News: స్మశానంలో ఎన్నికల ప్రచారం..  ఓటర్ల లిస్టులో  చనిపోయిన వ్యక్తుల పేర్లు..
Advertisement

Mahabubabad News: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం వార్డుల్లో ఎన్నికల అధికారులు రూపొందించిన ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తుల పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని, అర్హులైన వారు కాకుండా మరణించిన వారు ఓటర్లుగా ఉండటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వారు వాదించారు. ఈ వినూత్న నిరసన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అభ్యర్థులు నేరుగా స్థానిక స్మశాన వాటికకు వెళ్లి, అక్కడ ఉన్న సమాధుల వద్ద నిలబడి ఓట్లు వేయమని వేడుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. “ఓ అవ్వా… ఓ తాతా… నేను ఒకటో వార్డుకు అభ్యర్థిగా, 14వ నెంబర్ గుర్తు మీద మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలబడ్డాను. మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే… మీరు చచ్చిపోయి ఇప్పటికి ఆరు, ఏడు సంవత్సరాలు అవుతోంది. కానీ ఈ అధికారులు చూడండి… ఇప్పటికీ మీ పేరును ఓటర్ల జాబితాలోనే ఉంచారు.” అని అన్నారు.

Advertisement

ఓటర్ల జాబితా నుండి మృతుల పేర్లను తొలగించడంలో ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని వారు ఎండగట్టారు. ఓటర్ల జాబితాలో ఉన్న మృతుల పేర్లను, వారి సమాధులను చూపిస్తూ అధికారులకు కనువిప్పు కలిగేలా ఈ నిరసన చేపట్టారు. వెంటనే ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని, మరణించిన వారి పేర్లను తొలగించి పారదర్శకమైన జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Read Also: Harish Rao: రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే.. నేనే మంత్రిని.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×