E-Paper
Advertisement

Sreeja Konidela: దుబాయ్ లో చిక్కుకున్న మెగా డాటర్ శ్రీజ…సంచలనంగా మారిన పోస్ట్!

Sreeja Konidela: దుబాయ్ లో చిక్కుకున్న మెగా డాటర్ శ్రీజ…సంచలనంగా మారిన పోస్ట్!
Advertisement

Sreeja Konidela: గత మూడు రోజులుగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలా ఒక దేశం పై మరొక దేశం దాడులు చేసుకుంటున్న తరుణంలో గల్ఫ్ దేశాలపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో ఉంటున్న భారతీయులు ఎంతో భయాందోళనలకు గురి అవుతున్నారు. ఇలా గల్ఫ్ దేశాలలో ఎంతో మంది సెలబ్రిటీలు కూడా చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మెగా డాటర్ శ్రీజ కొణిదేల(Sreeja Konidela) సైతం ఇంస్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మేము క్షేమమే..

ఈమె చేసిన పోస్ట్ బట్టి చూస్తుంటే శ్రీజ సైతం తన పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నారని స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా శ్రీజ స్పందిస్తూ దుబాయిలో తాము క్షేమంగా, సురక్షితంగా ఉన్నామని తెలిపారు. మా పరిస్థితిని తెలుసుకొని ఫోన్లు మెసేజ్లు చేస్తూ మా క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ప్రేమ మాకు చాలా ఉపశమనం కలిగించింది. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది త్వరలోనే శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు శ్రీజ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ఇలా ఈమె దుబాయ్ లో ఉన్నట్లు తెలియజేయడంతో మెగా అభిమానులు కూడా ఈ విషయం తెలిసి ఈమె తన పిల్లలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

దుబాయిలో స్థిరపడిన శ్రీజ..

Advertisement

ఇకపోతే శ్రీజ ఈ పోస్టుతో పాటు మరొక పోస్ట్ కూడా చేశారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేస్తూ మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము, ఈ దేశానికే కట్టుబడి ఉంటాము అంటూ పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ ఈ పోస్ట్ చేస్తూ తాను తన పిల్లలతో కలిసి దుబాయిలో స్థిరపడ్డానని చెప్పకనే చెప్పేశారు. ఒకప్పుడు తన తండ్రితో కలిసి హైదరాబాదులోనే స్థిరపడిన శ్రీజ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి దుబాయిలో నివసిస్తున్నారని తెలుస్తోంది. ఇలా దుబాయ్ లో ఉండటంతో ఇటీవల కాలంలో మెగా కుటుంబంలో జరుగుతున్న ఎలాంటి వేడుకలలో కూడా శ్రీజ కనిపించలేదని చెప్పాలి.

రెండో భర్తకు విడాకులు..

Advertisement

ఇలా ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈమె ప్రస్తుతం దుబాయిలో స్థిరపడి, దుబాయ్ తమ సొంత దేశంగా భావిస్తున్నారని ఈ పోస్ట్ ద్వారా స్పష్టం అవుతుంది. ఇక శ్రీజకు నవిష్క, నివృత అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక శ్రీజ వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిదే. ఈమె చిన్న వయసులోనే తన కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పాప పుట్టిన తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం చిరంజీవి తనకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో ఎంతో ఘనంగా రెండో వివాహం చేశారు. మరోసారి పాప పుట్టిన తర్వాత శ్రీజ తన రెండో భర్త నుంచి కూడా విడాకులు తీసుకొని విడిపోయి తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.

Also Read: Anupama -Dhruv Vikram: విరోష్ బాటలోనే అనుపమ ధ్రువ్ విక్రమ్..ఫోటోలతో హింట్ ఇస్తున్నారుగా?

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×