E-Paper
Advertisement

కోట్లు ఉన్నా కీప్యాడ్ ఫోన్ మాత్రమే.. నోలన్ ఫోన్ వాడకపోవడానికి అసలు కారణం ఇదేనా?

కోట్లు ఉన్నా కీప్యాడ్ ఫోన్ మాత్రమే.. నోలన్ ఫోన్ వాడకపోవడానికి అసలు కారణం ఇదేనా?
Advertisement

Christopher Nolan:స్మార్ట్ ఫోన్ ..ఇది లేకపోతె అసలు ప్రపంచం ఏమైపోతుందా అని అనిపిస్తుంది అంటే ఆశ్చర్యంలేదు.మన జీవితాల్లో ఇది అంతలా పాతుకుపోయింది. ఇక పది నిమిషాల కొకసారి వాట్సప్ చెక్ చేసుకోకుండా, గంటకోసారి ఈమెయిల్ చెక్ చేసుకోకుండా ఈ రోజుల్లో ఉండటం అస్సలు ఇంపాజిబుల్.ఉదయం లేచినప్పటి నుండి పడుకునే దాకా టంగ్ టంగ్ మంటూ నోటిఫికేషన్ ల సౌండ్ రావడం వెరీ కామన్.

అలాంటిది , ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్ స్టెల్లార్’,టెనెట్ వంటి సూపర్ హిట్ సినిమాలని తీసిన నోలన్ మాత్రం అసలు ఫోన్ వాడడన్న సంగతి మీకు తెలుసా? అవును …ఫోన్ కాదు కదా కనీసం తన పేరు మీద ఒక ఈమెయిల్ ఐడీ కూడా లేదట.మాములుగా పని పాట లేని వాళ్ళే పొద్దుకు పది గంటలు స్మార్ట్ ఫోన్ లలో పాతుకుపోతుంటే ఏకంగా రెండు ఆస్కార్ అవార్డ్స్ ని దక్కించుకుని 21వ సెంచరీలో ది బెస్ట్ డైరెక్టర్ గా నిలిచిన నోలన్ మాత్రం అసలు స్మార్ట్ ఫోన్ నే వాడకపోవడం చాలా విచిత్రం.

Advertisement

ఒకవేళ స్మార్ట్‌ఫోన్ ఉంటే..

ఇక ఇదే విషయాన్ని ఫేమస్ హాలీవుడ్ టాక్ షో ‘ది టునైట్ షో విత్ జిమ్మీ ఫాలోన్’లో చెబుతూ తానెందుకు స్మార్ట్ ఫోన్ కి దారంగా ఉంటాననే విషయం చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే,దానికి అడిక్ట్ అయిపోతాననే భయం ఉందని, ముఖ్యంగా అందులో ఉండే ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇంస్టా వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, అలాగే ఎడా పెడా వచ్చే నోటిఫికేషన్లు తన ఫోకస్ ని డిస్టర్బ్ చేస్తాయని అందుకే తాను వాటికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

పాతకాలపు కీప్యాడ్ ఫోన్ మాత్రమే

ఇక జర్నీ చేసే సమయాల్లో మాత్రం ఎమర్జెన్సీ పర్పస్ లో ఒక పాతకాలపు కీప్యాడ్ ఫోన్ మాత్రమే వాడతానని,కార్లలో లేదా విమానాల్లో వెళ్తున్నప్పుడు ఫోన్ స్క్రీన్ వైపు చూడకుండా ప్రశాంతంగా కిటికీలోంచి బయటకు చూస్తుంటానని, ఆ సమయమే తనకు చాలా విలువైనదని స్పష్టం చేశాడు.అలానే తన తర్వాతి సినిమాలకి సంబంధించిన కథలు, డిఫరెంట్ ఐడియాస్ వంటివి వస్తాయని
వెల్లడించారు.

also read:ATMలో కార్డ్ ఇరుక్కుపోతే అసలు ఏమవుతుంది?

కేవలం పనిపైనే దృష్టి

అయితే ఈ రోజుల్లో ఒక చిన్న పని చేయాలన్నాఈమెయిల్స్, వందలాది వాట్సాప్ మెసేజ్‌లు తప్పనిసరి. మరి వందల మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కే భారీ సినిమాలను నోలన్ ఫోన్, ఈమెయిల్ లేకుండా ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇదే విషయాన్ని యాంకర్ జిమ్మీ ఫాలోన్ అడిగితే నవ్వుతూ సమాధానమిచ్చారు నోలన్ తన చుట్టూ ఎప్పుడూ అత్యంత నమ్మకమైన, సమర్థవంతమైన టీమ్ ఉంటుందని, తనకు తెలియాల్సిన ప్రతి ముఖ్యమైన విషయం వారి ద్వారానే సరైన సమయానికి చేరుతుందని చెప్పారు. అంతేకాదు, క్రిస్టోఫర్ నోలన్ సినిమాల షూటింగ్ సెట్‌లో ఎవరికీ ఫోన్లు వాడేందుకు అనుమతి ఉండదు. నటుల నుంచి ప్యాకింగ్ బాయ్స్ వరకు అందరూ సెట్‌లో కేవలం పనిపైనే దృష్టి పెట్టాలని ఆయన గట్టిగా నమ్ముతారు.

నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే !

ఇక నోలన్ విషయానికి వస్తే ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డంకిర్క్’, ‘టెనెట్’, ‘ఓపెన్‌హైమర్’ వరకు నోలన్ తీసిన ప్రతి సినిమా ఆడియన్స్ కి ఒక మైండ్ బెండింగ్ సినిమానే . ఇక తాజాగా విడుదలైన ‘ది ఒడిస్సీ’ఏ రకంగా వసూళ్ళ వర్షం కురిపిస్తుందో చెప్పక్కర్లేదు.ఏది ఎమైనా జనాలంతా టెక్నాలజీకి బానిసలుగా మారుతున్న ఈ కాలంలో నోలన్ ఇలా స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండటం అంటే నిజంగా మెచ్చుకోతగ్గ విషయమే !

Related News

పవన్ సాయి,కళ్యాణ్ పడాల ఇష్యూపై ‘బిగ్ బాస్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

లహరి షారి నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ కన్నా ఎక్కువే..

కాలికి గాయమైనా తగ్గని వరుణ్ తేజ్ జోష్.. సినిమా కోసం ఇంత కష్టమా!

జానపద సంగీతానికి కొత్త ఊపు.. ‘పళ్ళబురుసు’ నుంచి ‘కొత్త సోకు’ రిలీజ్!

“రెండేళ్ల తర్వాత చైతూ కోసం కిచెన్‌లోకి శోభిత?.. వైరల్ అవుతున్న పోస్ట్!”

‘జయం’ హీరోగా బన్నీ ఫిక్స్.. తర్వాత ఒక్కసారిగా నితిన్ ఎంట్రీ!

ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!

Big Stories

Advertisement
×