E-Paper
Advertisement

ATMలో కార్డ్ ఇరుక్కుపోతే అసలు ఏమవుతుంది?

ATMలో కార్డ్ ఇరుక్కుపోతే అసలు ఏమవుతుంది?
Advertisement

ATM Card: డబ్బులు అనే ఇంధనం లేకపోతే మనిషి అనే వాహనం నడవడం చాలా కష్టం. డబ్బుకున్న పవర్ అలాంటిది మరి. ఇక “డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజుగారంటారు” అంటూ నాగ్ పాట పాడి మరీ చెప్పాడు.

అంతటి పవర్ ఉన్న డబ్బుని మనం డ్రా చేసుకోవడానికి తరచుగా ATMకి వెళ్తూనే ఉంటాం. అక్కడ అడపా దడపా కొందరు డబ్బులు వచ్చాయన్న ఆనందంలోనో, లేక మతి మరుపు ఎక్కువయ్యో, లేక వెళ్లాలన్న తొందరలోనో ATM కార్డుని మెషీన్‌లో మర్చిపోవడం చూస్తూనే ఉంటాం.

Advertisement

మరి అలా ATMలో కార్డు ఇరుక్కుపోతే ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇరుక్కుపోయిన ATM కార్డును ఎలా బయటికి తీయాలో ఎప్పుడైనా ఆరా తీశారా? పోనీ, అలా ఇరుక్కుపోతే అకౌంట్‌లో డబ్బులేమైనా కట్ అవుతాయా అని బ్యాంకు వాళ్లని ఎప్పుడైనా అడిగారా?

లేకపోతే ఇప్పుడు తెలుసుకుందాం రండి…

Advertisement

ముందుగా మనం ATM అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా మంది అనుకున్నట్టుగా ఇది “Any Time Money”నో, లేక “Any Time Machine”నో కాదు. ATM అంటే Automated Teller Machine. అంటే బ్యాంకు వారి సహాయం లేకుండానే డబ్బులను ఇచ్చే యంత్రం అన్న మాట.

ఇక డబ్బుల కోసం ATM కార్డుని లోపల పెడితే, ఆ కార్డులో ఉన్న చిప్ లేదా మాగ్నెటిక్ స్ట్రిప్‌ను చదువుతుంది. తర్వాత బ్యాంక్ సర్వర్‌తో కనెక్ట్ అయి మీ అకౌంట్ వివరాలు చెక్ చేస్తుంది. ఇక ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక ముందుగా కార్డును బయటకు పంపిస్తుంది… ఆ తర్వాతే డబ్బులు ఇస్తుంది. ఇదీ ATM కార్డు ATMలో పెట్టగానే జరిగే ప్రాసెస్.

అయితే ఒకవేళ ముందుగా డబ్బులు ఇచ్చి, తర్వాత కార్డు ఇచ్చిందనుకోండి… చాలామంది డబ్బులు తీసుకుని ఆనందంలో కార్డు మర్చిపోయి వెళ్లిపోతారు. అందుకే ప్రపంచంలోని చాలా ATMలు ముందుగా కార్డు, ఆ తర్వాత క్యాష్ ఇచ్చేలా డిజైన్ చేశాయన్న మాట.

అయితే ముందు డబ్బులు ఇచ్చి, తర్వాత కార్డును రిలీజ్ చేసే ATMలు ఇంకా చాలా చోట్లనే ఉన్నాయి. అలాంటి వాటిలో ATM కార్డు తీసుకోకుండా డబ్బులు తీసుకుని వెళ్లిపోతే, ATM మెషీన్ “డబ్బులు తీసుకుని కార్డును నాకు వదిలేశాడు” అని గుర్తిస్తుంది. దాంతో ఆ తర్వాత ఎవరు వచ్చినా ఇవ్వకుండా కార్డును తనలోనే దాచుకుంటుంది ATM మెషీన్. దీనినే Card Retentionఅంటారు.

ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా? మీరు వెళ్లిపోయిన తర్వాత ఇంకొకరు వచ్చి మీ కార్డు తీసుకుని వాడకుండా ఉండటానికి. అంటే ATM మీ కార్డును దొంగిలించడం కాదు… మీ తరఫున దాచిపెడుతోందన్న మాట.

ఎక్కువ సార్లు తప్పు PIN ఎంటర్ చేసినా

అంతే కాదండోయ్… మీరు గనుక వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తప్పు PIN ఎంటర్ చేసినా, గడువు ముగిసిన కార్డు వాడినా, బ్యాంక్ ఇప్పటికే బ్లాక్ చేసిన కార్డు అయినా, లేదా ఏదైనా డౌట్ వచ్చే విధంగా ట్రాన్సాక్షన్ గుర్తించినా కూడా ATM కార్డును తనలోనే ఉంచేసుకుంటుంది. ఎందుకంటే బ్యాంక్ వారికీ తమ వద్ద డబ్బు దాచుకున్న వారి సేఫ్టీ అంత ముఖ్యం మరి.

అయితే కొన్నిసార్లు టెక్నికల్ కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుందండోయ్. కరెంట్ అనుకోకుండా పోయినా, నెట్‌వర్క్ కట్ అయినా, కార్డ్ రీడర్‌లో సమస్య రావచ్చు… లేదా మనకు తెలియకుండానే మన కార్డ్ చిప్ దెబ్బతిని ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా కార్డు బయటకు రాదు.

అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి… ATMలో కార్డు ఇరుక్కుపోయిందంటే అది పోయిందని తెగ బాధపడిపోకండి. ఎందుకంటే ప్రతి ATMలో Retain Bin అనే ఒక ప్రత్యేకమైన లాక్డ్ బాక్స్ ఉంటుంది. లోపలికి వెళ్లిన కార్డులన్నీ అందులోనే సేఫ్‌గా ఉంటాయి. అది ఎంత సేఫ్టీ అంటే ATMలో డబ్బులు నింపే వాళ్లు కూడా దాన్ని తెరవలేనంతగా. అది తెరవాలంటే మాత్రం ఆ బ్యాంక్ పర్మిషన్ ఉన్న సిబ్బందికే సాధ్యం.

ఇప్పుడు మీ కార్డు ATMలో ఇరుక్కుపోతే 

మొదటగా… మీరు గాబరా పడిపోకండి. అలా కాకుండా టెన్షన్‌లో మెషీన్‌ను కొట్టడం, కార్డును బయటకు లాగడానికి కత్తి, స్కేల్, వైర్ లాంటివి పెట్టి ట్రై చేయడం అస్సలు చేయకండి. అలా గనుక చేశారంటే కార్డు రావడం అటుంచండి… కార్డు అసలు పనికి రాకుండా పోతుంది. ఇక మెషీన్ కూడా పాడవడం పక్కా.

ముందుగా మీ కార్డు గనుక అందులోనే ఇరుక్కుపోతే ATM స్క్రీన్‌పై ఏదైనా మెసేజ్ వస్తే చదవండి. ఇక అక్కడే ఉన్న హెల్ప్‌లైన్ నంబర్‌కు వెంటనే కాల్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి కార్డును వెంటనే టెంపరరీగా బ్లాక్ చేయించండి. ఇప్పుడు చాలా బ్యాంకుల మొబైల్ యాప్‌లలో ఒకే క్లిక్‌తో కార్డును On లేదా Off చేసే ఆప్షన్ కూడా ఉండటం విశేషం.

Also read :“రెండేళ్ల తర్వాత చైతూ కోసం కిచెన్‌లోకి శోభిత?.. వైరల్ అవుతున్న పోస్ట్!”

ఇంకో విషయం… ATM దగ్గర “సార్… నేను హెల్ప్ చేస్తాను” అంటూ వచ్చేవాళ్లను అస్సలు నమ్మకండి. PIN చెప్పండి, OTP చెప్పండి, కార్డ్ ఇవ్వండి అని అడిగితే వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి బ్యాంక్‌కు అసలు విషయం చెప్పండి. కాస్త ఏమరుపాటుగా ఉంటె అకౌంట్లన్నీ ఊడ్చేస్తారు మరి.

ఇక అలా ATMలలో ఇరుక్కుపోయిన కార్డులను ఆ బ్యాంకు వాళ్లు సరైన ప్రూఫ్స్ ఇస్తే తిరిగి ఇచ్చేస్తారు. అయితే మరికొన్ని మాత్రం సెక్యూరిటీ రీజన్‌తో వాటి ప్లేస్‌లో కొత్తవి ఇస్తారు.

కాబట్టి ఇకపై ATMలలో మీరు కార్డును మర్చిపోయినా ఏం భయపడకుండా వెంటనే బ్యాంక్‌కు ఒక కాల్ కొట్టండి. అంతే తప్ప ఆగమాగం అయిపోయి మెషీన్‌ను కొట్టకండి. అది మీ కార్డును భద్రంగా దాచిపెట్టే మీ ఫ్రెండ్‌లా ఫీల్ అవ్వండి.

సో… బ్యాంకు వాళ్లకు కాల్ చేసి కార్డును బ్లాక్ చేయండి. వాళ్లు చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి.

అంతే… మీ డబ్బు సేఫ్, మీ ఖాతా కూడా సేఫ్.

సో ఇకనుంచైనా కార్డు మర్చిపోకండి. ఒకవేళ మర్చిపోతే ఈ మ్యాటర్ గుర్తు తెచ్చుకోండి… ఓకేనా!

 

Related News

ఇదీ.. కోదండ‌రాం, కేటీఆర్‌కు ఉన్న‌తేడా? రేపు ఢిల్లీకి టీజేఎస్‌.. సాకులు వెతుక్కున్న బీఆరెస్‌..!

టాలీవుడ్ మౌన‌మేలా..? ప‌వ‌నిజం నియంత్రిస్తోందా? కూట‌మి స‌ర్కార్ కంట్రోల్ చేస్తుందా?

ఈ దేశాల్లో NEET తరహా లీకులు జరిగితే.. మంత్రి రాజీనామా చేస్తారా? శిక్షలేంటీ?

మీడియా శ‌కం ముగిసింది… సోష‌ల్ మీడియా యుగం ఇది..! కేటీఆర్ మాట‌ల మ‌ర్మ‌మిదేనా..?

బీఆరెస్‌కు క‌లిసివ‌చ్చిన నిరుద్యోగ‌, యువ‌త‌.. పంటికింద రాళ్ల‌లా ధ‌ర్నాచౌక్‌, లీకేజీలు..!

వైర‌ల్ మోడ‌ల్‌..వ‌ర్షంలో త‌డుస్తూ.. పోలీస్‌వ్యాన్‌ను అడ్డుకుని.. సీజేపీ ఉద్య‌మంలో మెరిసిన‌ ముంబై న‌టి రిహియా అహిర్‌..!

మా ఫ్యామిలీ అంతా బీజేపీ స‌పోర్ట‌ర్సే.. కానీ ఇక‌పై కాదు.. వ‌ద‌లం మోడీ! ఆక‌ట్టుకున్న‌ ఆక‌ర్షిత‌..

Big Stories

Advertisement
×