LG AI Direct Drive Washing Machine: నేటి బిజీ లైఫ్‌లో బట్టలు ఉతకడం, వాటిని ఆరబెట్టడం పెద్ద సవాలుగా మారింది. సాధారణ వాషింగ్ మెషిన్లు వాడితే బట్టల ఫ్యాబ్రిక్ పాడవడం లేదా అలర్జీలు రావడం లాంటి సమస్యలు ఉంటాయి. కానీ LG తీసుకొచ్చిన AI Direct Drive (AI DD), స్టీమ్ వాష్, 1400 RPM హై స్పిన్ స్పీడ్ టెక్నాలజీలు ఈ సమస్యలన్నింటికీ పర్‌ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తాయి. మీ బట్టల రకాన్ని బట్టి వాషింగ్ ప్యాటర్న్‌ను ఏఐ ద్వారా అడ్జస్ట్ చేసే బెస్ట్ 5 ఎల్ జీ వాషింగ్ మెషిన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీది 4 నుంచి 5 మంది సభ్యులు ఉన్న కుటుంబం అయితే.. ఈ 8 కిలోల మోడల్ చాలా పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇది బట్టల రకాన్ని ఆటోమేటిక్‌గా రీడ్ చేసి ఫ్యాబ్రిక్ పాడవకుండా 18 శాతం వరకు ఎక్కువ రక్షణ ఇస్తుంది. ఇందులో ఉండే 1400 RPM స్పిన్ స్పీడ్ వల్ల బట్టలు చాలా వేగంగా ఆరిపోతాయి. అంతేకాకుండా.. దీనిలోని స్టీమ్ టెక్నాలజీ బట్టల్లోని అలర్జెన్లను తొలగించి, బట్టలను చాలా సాఫ్ట్‌గా మారుస్తుంది. లాంగ్ లాస్టింగ్ బిల్డ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మోడల్ అంచనా ధర రూ. 35,990 నుండి రూ. 38,500 వరకు ఉంటుంది.
పెద్ద కుటుంబాలకు, బెడ్‌షీట్లు, రగ్గులు ఎక్కువగా ఉతికే వారికి ఈ 9 కేజీల మోడల్ చాలా బాగా సరి పోతుంది. ఇందులో.. LG ThinQ వైఫై కనెక్టివిటీ ఉండడం వల్ల మీరు ఎక్కడ ఉన్నా.. స్మార్ట్ ఫోన్ నుంచే, మెషిన్‌ను ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. 1400 RPM స్పీడ్ , టర్బో వాష్ ఫీచర్ ఉండడం వల్ల చాలా తక్కువ సమయంలోనే.. వాషింగ్ పూర్తవుతుంది. నాణ్యమైన ఇన్-బిల్ట్ హీటర్ వల్ల వేడి నీటితో .. బట్టలను ఈజీగా విసికేసి జిడ్డు మురికిని వదిలిస్తుంది. ఈ మోడల్ అంచనా ధర మార్కెట్లో రూ. 41,500 నుంచి రూ. 45,000 వరకు ఉంది.
చిన్న కుటుంబాలు లేదా కొత్తగా పెళ్లయిన దంపతులకు ఈ 7 కేజీల వాషింగ్ మెషిన్ బెస్ట్. తక్కువ కరెంట్ , తక్కువ నీటి వాడకంతో ఇది ప్రొఫెషనల్ వాషింగ్ క్వాలిటీని అందిస్తుంది. ఇందులో.. ఉండే 1200 నుంచి 1400 RPM స్పిన్ స్పీడ్ బట్టల తేమను వేగంగా పోగొడుతుంది. అలర్జీ కేర్ స్టీమ్ సైకిల్ వల్ల పిల్లల బట్టలు చాలా సురక్షితంగా, పరిశుభ్రంగా మారుతాయి. బడ్జెట్ రేంజ్‌లో అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ కాంబినేషన్. ఈ మోడల్ అంచనా ధర రూ. 29,990 నుంచి రూ. 33,000 వరకు అందుబాటులో ఉంది.
వర్షాకాలంలో లేదా చలికాలంలో బట్టలు ఆరకపోవడం పెద్ద తలనొప్పిగా మారుతుంది, అయితే ఈ మోడల్‌తో ఆ సమస్యకు శాశ్వత చెక్ పెట్టవచ్చు. ఇది కేవలం బట్టలను ఉతకడమే కాకుండా ..100 శాతం ఆరబెట్టి అందిస్తుంది. 10 కేజీల వాషింగ్, 6 కేజీల డ్రైయింగ్ కెపాసిటీతో వచ్చే ఈ మెషిన్ ప్లాట్లలో.. ఉండే వారికి లేదా బాల్కనీ స్పేస్ తక్కువగా ఉన్నవారికి ఐడియల్ ఆప్షన్. ఇందులో ఏఐ డీడీతో పాటు స్మార్ట్ ThinQ వైఫై సపోర్ట్ కూడా ఉంది. ఈ ప్రీమియం మోడల్ అంచనా ధర రూ. 54,000 నుంచి రూ. 59,900 వరకు ఉంటుంది.
Also Read: స్మార్ట్ కిచెన్ కోసం టాప్ 5 మిక్సీ గ్రైండర్లు.. వంట పని ఇక నిమిషాల్లో క్లోజ్!
బెస్ట్ డిజైన్, అడ్వాన్స్‌డ్ వాషింగ్ టెక్నాలజీ కావాలనుకునే వారి కోసం ఈ 8.5 కేజీల మోడల్ డిజైన్ చేయబడింది. దీనిలోని స్టెయిన్‌లెస్ స్టీల్ లిఫ్టర్, టంబులర్ బట్టల్లో ఉండే గట్టి మురికిని కూడా వేగంగా తొలగిస్తాయి. స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ వల్ల కరెంట్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. దీని టచ్ ప్యానెల్ , టెంపర్డ్ గ్లాస్ డోర్ మెషిన్‌కు ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. డైలీ వాషింగ్ కోసం లాంగ్ లాస్టింగ్ మోడల్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ మోడల్. ఈ వాషింగ్ మెషిన్ అంచనా ధర రూ. 37,500 నుంచి రూ. 40,000 వరకు ఉంటుంది.
మీ ఇల్లు, కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా సరైన మోడల్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. తక్కువ బడ్జెట్‌లో.. మంచి పర్ఫార్మెన్స్ కోసం 7Kg లేదా 8Kg మోడల్స్, అలాగే హెవీ వాషింగ్ అండ్ కంప్లీట్ డ్రైయింగ్ కోసం 10Kg Wash & Dry మోడల్ ఎంచుకోవడం బెస్ట్. స్మార్ట్ LG AI వాషింగ్ మెషిన్లతో మీ ఇంటి పనులను మరింత వేగంగా మార్చేసుకోండి.