E-Paper
Advertisement

CID Abhijith : రాజమౌళి సినిమాలో అభిజిత్.. ఇదేం ట్విస్ట్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

CID Abhijith : రాజమౌళి సినిమాలో అభిజిత్.. ఇదేం ట్విస్ట్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
Advertisement

CID Abhijith : కామెడీ షోలక్ కన్నా క్రైమ్ షోలను చూసేందుకు జనాలు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో వచ్చిన ఏ ఇన్వెస్టిగేషన్ షోలకు రాని రెస్పాన్స్ సీఐడీ షోకు వచ్చింది.. క్రైమ్ రేటును తగ్గించడం.. అలాగే క్రైమ్ సీన్ ను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సీరియల్ యొక్క ప్రతి సీను కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. దాంతో జనాల్లోకి వచ్చినా కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయింది.. అయితే ఈమధ్య ఈ సీరియల్ ప్రసారం అవ్వలేదు.. కానీ పాత ఎపిసోడ్లను జనాలు చూస్తున్నారు. ఆ క్రైమ్ షోలో ఇన్స్పెక్టర్ అభిజిత్ పాత్ర పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు ఆదిత్య శ్రీవాస్తవ నటించారు. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాలో ఈయన నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తెలుగు సినిమాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలో ఛాన్స్ గురించి బయటపెట్టారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. తెలుగు హీరోల పై ఆయన అభిప్రాయం ఏంటో ఒకసారి తీసుకుందాం.

రాజమౌళి సినిమాలో ఛాన్స్..

సీఐడీ లో నటించిన ఇన్స్పెక్టర్ అభిజిత్ ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా పేరు త్రిముఖ.. జనవరి 2 ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చిత్రంలో నటించిన నటీనటులు అందరూ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సీఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ అలియాస్ ఆదిత్య శ్రీవాస్తవ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. యూపీలో ఆయన విద్యాభ్యాసం జరిగినట్లు చెప్పారు. అలాగే తన యాక్టింగ్ ఎప్పుడు మొదలైంది అన్న విషయాల గురించి పంచుకున్నారు.. ఈ సందర్భంగా రాజమౌళి గారు ఇలాంటి పెద్ద డైరెక్టర్ సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నట్లు బయటపెట్టారు. ఇప్పటివరకు క్రైమ్ సీన్లో ఎక్కువగా కనిపించిన ఈయనకు రాజమౌళి తన సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.. అంతే కదూ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాలలో నచ్చిన సినిమాల గురించి బయటపెట్టారు. అలాంటి పెద్ద సినిమాల్లో నటించాలనుకుంటున్న విషాయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఈయనకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండు అని నెటిజెన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : ఈ ఏడాదిలో సెలబ్రిటీల కాంట్రవర్సీలు.. దీపికా పదుకొనే నుంచి శివాజీ వరకు..

‘త్రిముఖ’ మూవీ విషయానికొస్తే.. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం త్రిముఖ.. యోగేశ్‌ , సాహితీ దాసరి , ఆకృతి అగర్వాల్ ఇందులో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. రాజేశ్‌ నాయుడు దర్శకత్వంలో శ్రీదేవి మద్దాలి, రమేశ్‌ మద్దాలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆ పాటతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రాన్ని జనవరి 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చెయ్యనున్నారు. ఇందులో సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ్, మొట్ట రాజేంద్రన్, ఆశు రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు..

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×