E-Paper
Advertisement

Director Teja: టికెట్ల రేట్ల కంటే పాప్ కార్న్ ధర ఎక్కువ: డైరెక్టర్ తేజ

Director Teja: టికెట్ల రేట్ల కంటే పాప్ కార్న్ ధర ఎక్కువ: డైరెక్టర్ తేజ
Advertisement

Director Teja: ఇటీవల కాలంలో సినిమా టికెట్ల ధరల పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను భారీగా పెంచిన నేపథ్యంలోనే థియేటర్లకు ప్రేక్షకులు దూరం అవుతున్నారనే వాదన వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో చిత్ర నిర్మాతలతో పాటు ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి. తెలంగాణ సర్కార్ ఇకపై సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి కుదరదని తేల్చి చెప్పారు. ఇకపోతే తాజాగా ప్రముఖ దర్శకుడు తేజ(Teja) సైతం సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

టికెట్ రేట్లపై చర్చలు…

ఇటీవల డైరెక్టర్ తేజతో పాటు పలువురు ఎఫ్డీసీ, హోంశాఖ అధికారులు కలిసి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి ప్రస్తావించారని తెలుస్తోంది. 24 క్రాఫ్ట్ కి సంబంధించిన సమస్యలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు సమాచారం. ఇక ఈ సమావేశం అనంతరం దర్శకుడు తేజ మీడియాతో మాట్లాడుతూ తాను అన్ని రంగాలలోనూ పనిచేశాను కాబట్టి ప్రతి ఒక్క సమస్య గురించి నాకు తెలుసని తెలిపారు. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల గురించి సినిమా క్యాంటీన్ రేట్ల గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తేజ తెలిపారు.

పాప్ కార్న్ ధరలే ఎక్కువ..

Advertisement

ఇలా ఇండస్ట్రీ సమస్యలు విన్న ప్రభుత్వం త్వరలోనే ఓ మంచి నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేయబోతుందని తేజ తెలిపారు. టికెట్ల రేట్ల విషయంలోనూ అలాగే పాప్ కార్న్(Popcorn) రేటు విషయంలో గత రెండు సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను ఎందుకంటే నేను ప్రతి ఒక్క సినిమాని థియేటర్ కి వెళ్లి చూస్తాను థియేటర్లో సినిమా చూసేటప్పుడు పాప్ కార్న్ లేకపోతే నేను సినిమా చూడనని అలాంటి నాకే వాటి ధరలు చూసి ఆశ్చర్యం కలిగిందని తేజ తెలిపారు.

ఐబొమ్మ రవి అరెస్ట్.. పైరసీ ఆగలేదు

Advertisement

ఇక మూవీ పైరసీ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చినట్లు తెలిపారు. సినిమాలను పైరసీ చేస్తున్న ఐ బొమ్మ రవిని పట్టుకున్నారు కానీ సినిమా పైరసీని మాత్రం ఆపలేకపోయారని తేజ తెలిపారు. మూవీ పైరసీ అలాగే ఓటీటీ కారణంగా ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతోందని తేజ ఈ సందర్భంగా తెలియజేశారు. టికెట్ల ధరల గురించి మాట్లాడుతూ కచ్చితంగా పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచాలి అలాగని ఆ ధరలను చూసి ప్రేక్షకులు థియేటర్ కు రాకుండా ఉండకూడదని తెలిపారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళాలి అంటే భారీ బడ్జెట్ పెట్టాలి అలాంటప్పుడు సినిమా టికెట్లు కూడా కొంత మొత్తంలో పెంచడం అవసరమని తేజ ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: Anasuya Bhardwaj: మీలోనూ అందమైన వ్యక్తి ఉన్నారు.. మరో పోస్ట్ వేసిన అనసూయ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×