E-Paper
Advertisement

భార్యకు సర్జరీ వెక్కి వెక్కి ఏడ్చిన అలీ..అసలేం జరిగిందంటే?

భార్యకు సర్జరీ వెక్కి వెక్కి ఏడ్చిన అలీ..అసలేం జరిగిందంటే?
Advertisement

Comedian Ali: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అలీ ఒకరు. బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ(Ali) అనంతరం కమెడియన్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ఈయన కొన్ని వందల సినిమాలలో నటిస్తూ తన కామెడీ పంచ్ డైలాగులతో అందరిని నవ్వించారు. ఇప్పటికీ ఈయన పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా అలీ భార్య జుబేదా (Zubeda)సైతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

అనారోగ్యానికి గురైన జుబేదా..

ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వంటలకు సంబంధించిన వీడియోలతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. మరోవైపు వ్యాపార రంగంలోకి కూడా జుబేదా ఎంట్రీ ఇచ్చారు. ఇలా నిత్యం తన భార్య జుబేదతో కలిసి పలు వీడియోలలో సందడి చేస్తున్న అలీ తాజాగా తన భార్య విషయంలో ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడుస్తున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. అలీ ఇలా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఆయన భార్య జుబేధకు హార్ట్ సర్జరీ జరగటం కారణమని చెప్పాలి.

గుండెకు సర్జరీ విజయవంతం..

Advertisement

ఎంతో ఆరోగ్యంగా చలాకీగా ఉన్న జుబేదాకు గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఈమె తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈమెకు హార్ట్ సర్జరీ సక్సెస్ఫుల్ అయిందని తెలుస్తుంది. అయితే తన భార్య సర్జరీ చేయించుకోవడం ఐసీయూలో ఉండటం చూసిన అలీ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.. తన భార్యకు ఇలాంటి సమస్య రావడంతో ఈయన ఎంతో ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా అలీ చిన్న పిల్లాడిలాగా తన భార్య కోసం ఏడ్చడంతో ఎంతోమంది అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ జుబేదా గారికి ఎలాంటి ప్రమాదం జరగదని ఆమె ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్ లు చేస్తున్నారు . అలీ ఇలా ఎమోషనల్ అవడంతో ఆయనకు భార్య పట్ల ఎంత ప్రేమ ఉందో స్పష్టమవతుంది అంటూ మరి కొంతమంది ఈ వీడియో పై స్పందిస్తూ జుబేదా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక అలీ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఆలీతో జాలీగా అనే కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించిన ఈయన ప్రస్తుతం అలీతో సరదాగా అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు . ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారితో ముచ్చటిస్తూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Also Read: కిరణ్ అబ్బవరం ‘భజగోవిందం’ సాంగ్ పై ఏపీ సీఎం ప్రశంసలు.. రియాలిటీ పై పెరిగిన బజ్!

Related News

అమ్మా నువ్వే చేయించుకో… సీతమ్మ పాత్ర చేయడం పై సాయి పల్లవి కామెంట్స్!

నాలోనే ఆ సమస్య ఉందనుకున్నాను – కీర్తి సురేష్

మా సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు.. విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!

కిరణ్ అబ్బవరం ‘భజగోవిందం’ సాంగ్ పై ఏపీ సీఎం ప్రశంసలు.. రియాలిటీ పై పెరిగిన బజ్!

వామ్మో ఆసిన్ కుమార్తెకు ఇలాంటి టాలెంట్ ఉందా? సూపర్ కిడ్ అంటూ!

విజయ్ పై భారీ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక!

ఏందయ్యా స్వామి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. విరోష్ కెమిస్ట్రీ అదుర్స్!

Big Stories

Advertisement
×