AIADMK MLAs: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ఆరుగురు AIADMK ఎమ్మెల్యేల రాజీనామా, పార్టీ మార్పు వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఎమ్మెల్యేల రాజీనామాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
పార్టీ మారడం రాజకీయ ప్రక్రియలో భాగమే
కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లడం అనేది సాధారణ రాజకీయ ప్రక్రియలో భాగమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల స్వేచ్ఛాయుత నిర్ణయాలను తప్పుపట్టలేమని అభిప్రాయపడింది.
రాజీనామా వేరు.. అనర్హత వేరు
ఈ సందర్భంగా రాజ్యాంగ నిబంధనలపై స్పష్టత ఇచ్చిన సుప్రీంకోర్టు, రాజీనామా చేయడం , ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అనేవి పూర్తిగా వేర్వేరు ప్రక్రియలని పేర్కొంది. రెండింటినీ ఒకే కోణంలో చూడలేమని స్పష్టం చేసింది.
స్పీకర్‌కు కీలక ఆదేశాలు
అలాగే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి విచారణను వేగంగా పూర్తి చేయాలని సూచించింది. దీంతో ఈ తీర్పు తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
Also Read: ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ.. ఇలా దోపిడీ చేయడం ఏంటి?: అనిల్ కుమార్ యాదవ్