E-Paper
Advertisement

Rahul Ramakrishna: హుషారు 2 సినిమా షూటింగ్ లో రాహుల్ రామకృష్ణకు ప్రమాదం.. ఎలా ఉందంటే?

Rahul Ramakrishna: హుషారు 2 సినిమా షూటింగ్ లో రాహుల్ రామకృష్ణకు ప్రమాదం.. ఎలా ఉందంటే?
Advertisement

Rahul Ramakrishna: ప్రముఖ నటుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. పలు సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన రాహుల్ రామకృష్ణ ఇటీవల కాలంలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈయన హుషారు 2 (Husharu 2 )సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా నటుడు రాహుల్ రామకృష్ణ ప్రమాదానికి గురయ్యారని సమాచారం. ఈ ప్రమాదంలో భాగంగా రాహుల్ రామకృష్ణకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.

స్వల్ప గాయాలతో బయటపడిన నటుడు..

రాహుల్ రామకృష్ణ నటిస్తున్న హుషారు 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం భోపాల్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. అయితే ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈయనకు ప్రమాదం జరిగిందని స్వల్ప గాయాలు కావడంతో వెంటనే చిత్ర బృందం భోపాల్ లోని చెందేరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే రాహుల్ రామకృష్ణకు ప్రమాదం జరిగినట్టు ఇప్పటివరకు చిత్ర బృందం కానీ లేదా నటుడు రాహుల్ రామకృష్ణగాని ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు.

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాహుల్ రామకృష్ణ..

Advertisement

ఈ ప్రమాదంలో ఈయనకు స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హుషారు సినిమా 2018 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సీక్వల్ గా హుషారు2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రాహుల్ రామకృష్ణ, అన్ష్, వసువి గణేశన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

వివాదాస్పద పోస్టులతో ..

Advertisement

ఇకపోతే రాహుల్ రామకృష్ణ నటుడిగా సినిమాలలో నటిస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు అయితే ఇటీవల ఈయన సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలకు సంబంధించిన విషయాల గురించి అలాగే తెలంగాణ ప్రభుత్వం గురించి ఇటీవల రాహుల్ రామకృష్ణ చేసిన పోస్టులు వివాదంగా మారడంతో ఈయన వార్తల్లో నిలిచారు. ఇలా సోషల్ మీడియా పోస్టుల ద్వారా విమర్శలను కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కమెడియన్ గా హీరోగా ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: Bucchi Babu: రైరైరారా డ్యాన్స్ ఇరగదీసిన చిన్నారి.. వీడియో కాల్ చేసిన బుచ్చి..సినిమా ఛాన్స్ వచ్చినట్టేనా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×