Ola Electric Ugadi Offers 2026: ఓలా ఎలక్ట్రిక్ ఉగాది, నవరాత్రి పండుగ సందర్భంగా క్రేజీ డిస్కౌంట్స్ ప్రకటించింది. మార్చి 2026 ఆఫర్ లో భాగంగా, ఎండ్ ICE ఏజ్ పేరిట భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, రోడ్ స్టర్ బైక్ లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలు అందిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్, 8 ఏళ్ల వరకు ఉచిత వారంటీ పొందే అవకాశం కల్పిస్తుంది.
ఓలా ఎలక్ట్రిక్ ఉగాది ఆఫర్ లో భాగంగా మొత్తం రూ. 30,000 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. స్కూటర్లు, రోడ్ స్టర్ మోడల్స్ మీద ఈ డిస్కౌంట్స్ ను అందుబాటులో ఉంచింది. ఇక నగదు తగ్గింపులో భాగంగా S1 మోడళ్లపై రూ. 10,000 వరకు తగ్గింపు అందిస్తుంది.
ఓలా బ్యాంక్ ఆఫర్లు:ఇక ఫెడరల్, IDFC, యెస్ బ్యాంక్, యాక్సిస్, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 10,000 వరకు తగ్గింపు అందిస్తుంది.
ఉచిత వారంటీ: అటు ఓలా ఎలక్ట్రిక్ కు సంబంధించిన మోడళ్లపై 8 సంవత్సరాల వరకు ఎక్స్ టెండెడ్ వారంటీని అందిస్తుంది. అటు 50% తగ్గింపుతో MoveOS+ అప్ డేట్ కూడా అందిస్తుంది.
⦿ ఓలాS1 Pro Gen 3: ఓలా ఎలక్ట్రిక్ లో అత్యంత పవర్ ఫుల్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ ఓలా S1X: ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్. ఈ స్కూటర్ రూ. 49,999 నుంచి ప్రారంభం అవుతుంది.
⦿ ఓలా Roadster Series: కొత్తగా విడుదలైన రోడ్ స్టర్ బైక్‌లు అయిన రోడ్ స్టర్ ప్రో, రోడ్ స్టర్ ఎక్స్ మోడల్స్ మీద తగ్గింపు అందిస్తుంది.
ఇక ఈ ఆఫర్లు మార్చి 16 నుంచి అందుబాటులోకి రాగా, ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయి. అటు ఈ ఆఫర్లు స్టోర్లను బట్టి మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సమీపంలోని ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను వెళ్లాలని ఓలా సూచించింది.
Read Also: ఏథర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సర్వీసింగ్ ఇక మీ ముందుకే!
ఇక గత ఏడాది వరకు ఎలక్ట్రిక్ రంగంలో సత్తా చాటిన ఓలా ఇప్పుడు వెనుకబడింది. ఒకప్పుడు మార్కెట్ లో 60 శాతానికి పైగా వాటాతో సత్తా చాటగా, ఇప్పుడు టాప్ 5 లిస్టులో కూడా పేరు దక్కించుకోలేకపోయింది. దిగ్గజ టూ వీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగు పెట్టడంతో ఈ కంపెనీ స్కూటర్లకు ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వందల స్టోర్లను క్లోజ్ చేసింది. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రత్యేక రాయితీలు, డిస్కౌంట్ల లాంటి ఆఫర్లను ప్రకటించింది. అందులో భాగంగానే ఉగాది ఆఫర్లు కూడా తీసుకొచ్చింది.
Read Also: మూడు చక్రాలు, ఓ ఎయిర్ బ్యాగ్.. యమహా స్కూటర్ భలే ఉంది భయ్యా!