E-Paper
Advertisement

The Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రాకపోవటానికి కారణం అదే, అనవసరంగా తమన్ తప్పుపట్టాం

The Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రాకపోవటానికి కారణం అదే, అనవసరంగా తమన్ తప్పుపట్టాం
Advertisement

The Raja Saab: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల అవ్వడానికి దాదాపు మూడు నెలలకు ముందే ట్రైలర్ కూడా విడుదల చేసేసారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నిటిని మించి ప్రభాస్ ఈ ట్రైలర్ లో చాలా అందంగా కనిపించడం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్.

ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇప్పటివరకు విడుదల కాలేదు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేస్తున్నాము అని గతంలో ప్రొడ్యూసర్ పీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత మౌళి సినిమా ప్రెస్ మీట్ లో నవంబర్ 5న ఫస్ట్ సింగిల్ ఉండబోతుంది అని కూడా చెప్పారు. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాలేదు.

ఫస్ట్ సింగిల్ రాకపోవటానికి కారణం 

Advertisement

ఈ సినిమాకి సంబంధించి ఆడియో రైట్స్ ఫస్ట్ సరిగమ వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ రైట్ సరిగమ నుంచి టీ సిరీస్ కు మారాయి. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లేట్ అవ్వడానికి ఇదే కారణం అని విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.

మరోవైపు ప్రభాస్ కూడా డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ జపాన్ లో ఉన్న తన ఫాన్స్ ను డిసెంబర్ 5 ఆరో తారీఖున కలిసే అవకాశం ఉంది. అలానే అమెరికాలో ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 25న జరగబోతున్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు.

తమన్ తప్పులేదు 

Advertisement

మరోవైపు ఈ సింగిల్ రాకపోవడానికి కారణం తమన్ అని చాలామంది అభిప్రాయపడ్డారు. అఖండ 2 సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి ఆ పనుల్లో పడిపోయి ప్రభాస్ సినిమాను మర్చిపోయాడు అని అందరూ అనుకున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా చేశారు.

అయితే ఇవేవీ కాకుండా కేవలం ఆడియో కంపెనీ మారడం వలన సాంగ్స్ డిలే అవుతున్నాయి అని ఒక క్లారిటీ వస్తుంది. ఇకపోతే తమన్ వైపు నుంచి సాంగ్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అలానే నిర్మాత ఎస్కేఎన్ మాటల ప్రకారం ఫస్ట్ ఏ సాంగ్ విడుదల చేయాలి అనే డౌట్ కూడా వాళ్లలో ఉంది. నార్త్ మార్కెట్ వాళ్లు మెలోడీ సాంగ్స్ చేద్దాం అని అనుకుంటున్నారు. సౌత్ లో మాత్రం మాస్ సాంగ్ విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారు.

ఈ రెండింటికి సంబంధించిన మార్కెటింగ్ టీం కి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.

Also Read: GOAT The Movie : పాగల్ డైరెక్టర్, మహిళలను అలా చూస్తాడు. దివ్యభారతి సంచలన కామెంట్స్

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×