E-Paper
Advertisement

Divya Bharathi : పాగల్ డైరెక్టర్, మహిళలను అలా చూస్తాడు. దివ్యభారతి సంచలన కామెంట్స్

Divya Bharathi : పాగల్ డైరెక్టర్, మహిళలను అలా చూస్తాడు. దివ్యభారతి సంచలన కామెంట్స్
Advertisement

Divya Bharathi: కొంతమంది దర్శకులుగా ప్రూవ్ చేసుకోవాలి అని విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దర్శకులుగా అవకాశం వచ్చిన తర్వాత కూడా ప్రూవ్ చేసుకోకపోతే వాళ్లకు అవకాశాలు రావడం అనేది చాలా కష్టం. విశ్వక్సేన్ నటించిన పాగల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాత ఆ సినిమాను ప్రమోట్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏకంగా అల్లు అర్జున్ ఆర్య సినిమాతో కూడా ఆ సినిమాను పోల్చారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత సుడిగాలి సుదీర్ హీరోగా గోట్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా నుంచి దర్శకుడుని తప్పించారు. నిర్మాత ఆ సినిమాకి దర్శకుడుగా మారాడు. నరేష్ పైన రీసెంట్ గా ఆ సినిమాలో నటిస్తున్న దివ్యభారతి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్ చేశారు.

మహిళలను అలా చూస్తాడు 

Advertisement

నరేష్ ట్విట్టర్ వేదికగా ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సింది, ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేసావురా? స్టెప్పం కొట్టి డప్పం వేయనా? ఈ ఒక్క పాటతో రెండు చేతులు గుండెపై పెట్టుకొని.. అంటూ నరేష్ స్పీడ్ చేశాడు.

ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ దివ్యభారతి దర్శకుడు నరేష్ పైన రెచ్చిపోయింది. స్త్రీలను “చిలకా” లేదా మరేదైనా పదం అని పిలవడం హానిచేయని జోక్ కాదు, ఇది లోతుగా పాతుకుపోయిన స్త్రీ ద్వేషాన్ని ప్రతిబింబిస్తుంది. మరియు ఇది ఒక సంఘటన కాదు; ఈ దర్శకుడు సెట్‌లో కూడా అదే పద్ధతిని అనుసరించాడు, పదే పదే మహిళలను అగౌరవపరుస్తూ మరియు నిజాయితీగా, తాను సృష్టిస్తున్నానని చెప్పుకునే కళకే ద్రోహం చేశాడు.

Advertisement

హీరో మౌనంగా ఉండటం చూసి నేను చాలా నిరాశ చెందాను, ఈ సంస్కృతిని మరొక రోజు మనుగడ సాగించడానికి అనుమతిస్తున్నాను. నేను బాగా ఎంచుకుంటాను.స్త్రీలు ఎగతాళికి గురికాని, ప్రతి స్వరం ముఖ్యమైన, మరియు గౌరవం చర్చించలేని ప్రదేశాలను నేను ఎంచుకుంటాను. ఇది కేవలం ఒక ఎంపిక కాదు; ఇది ఒక కళాకారిణిగా మరియు ఒక మహిళగా నా ప్రమాణం! అంటూ దివ్యభారతి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

హీరో మౌనం వెనుక కారణం 

అయితే ఈ దర్శకుడు గతంలో జబర్దస్త్ షో కి రైటర్ గా పనిచేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ పరిచయం వలన సుధీర్ మౌనంగా ఉండి ఏమీ అనకుండా ఉన్నారు అని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన దర్శకుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ఒక తమిళ్ హీరోయిన్ ఈ రేంజ్ లో హర్ట్ అయ్యారు అంటే విషయం కొంచెం సీరియస్ అయ్యేలానే ఉంది అనిపిస్తుంది.

Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా వర్కౌట్ అవుతుందా, గతంలో ఆ కాన్సెప్ట్ ఫెయిల్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×