E-Paper
Advertisement

Mythri movie makers :మరోసారి ఇళయరాజాతో మైత్రికి చిక్కులు.. ఫైన్ కట్టాల్సిందేనా?

Mythri movie makers :మరోసారి ఇళయరాజాతో మైత్రికి చిక్కులు.. ఫైన్ కట్టాల్సిందేనా?
Advertisement

Mythri movie makers : సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు ఇళయరాజా. ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని శ్రోతలు కూడా ఉండరు. కొన్ని సందర్భాలలో సినిమాలు విఫలమైనా కూడా ఇళయరాజా సంగీతం విపరీతంగా సక్సెస్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఒక అద్భుతమైన పాటను వింటున్నప్పుడు ఇది ఇళయరాజా కంపోజ్ చేశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అతని కంపోజిషన్ లో ఆ సిగ్నేచర్ ఉంటుంది.

రీసెంట్ టైమ్స్ లో ఇళయరాజా సంగీతం కంటే కూడా ఇళయరాజా పెడుతున్న కంప్లైంట్లు బాగా ఫేమస్ అయ్యాయి. దీనికి కారణం ఇళయరాజా పాటలను కొన్ని సినిమాల్లో వాడుకోవడం. వెంటనే ఇళయరాజా వారికి నోటీసులు పంపించడం. ఇవన్నీ కామన్ గా జరిగిపోతున్నాయి. ఇళయరాజాకు డెడికేషన్ గా కూడా ఒక పాట వాడిన వెంటనే నోటీసులు రావడం సహజంగా జరుగుతుంది.

మైత్రికి చిక్కులు 

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ బ్యానర్లో సినిమాలు చేశారు. అలానే సీనియర్ స్టార్ హీరోస్ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళు కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా మైత్రి మూవీ మేకర్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాను నిర్మించింది ఈ సంస్థ. మరోవైపు ప్రదీప్ రంగనాథన్ హీరోగా డ్యూడ్ వంటి మిడ్ రేంజ్ సినిమా కూడా చేశారు.

Advertisement

ఈ రెండు సినిమాలలో కూడా ఇళయరాజా కు సంబంధించిన కొన్ని పాటలను వాడటం వలన మైత్రికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇళయరాజా నోటీసులు పంపించారు. 50 లక్షలు ఇళయరాజాకు ఇచ్చేస్తే ఈ గొడవ సెటిల్ అయిపోతుంది. లేకపోతే మరిన్ని చిక్కులు మైత్రి మూవీ మేకర్స్ కి రావడం తప్పదు.

భారీ ప్రాజెక్టులు 

ఈ సంస్థలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఎన్టీఆర్ డ్రాగన్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పౌజి వంటి భారీ సినిమాలు ప్రస్తుతం ఈ బ్యానర్ లో నిర్మితమవుతున్నాయి. ఈ అన్ని సినిమాలు మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఇదే బ్యానర్ నుండి ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకి సంబంధించి మంచి ప్రశంసలు వచ్చాయి కానీ ఊహించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు.

Also Read : Nandamuri Balakrishna : మద్రాస్ నా జన్మభూమి, నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×