E-Paper
Advertisement

Nandamuri Balakrishna : మద్రాస్ నా జన్మభూమి, నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్

Nandamuri Balakrishna : మద్రాస్ నా జన్మభూమి, నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్
Advertisement

Nandamuri Balakrishna : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన సక్సెస్ సాధిస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ అనే షో విపరీతంగా పాపులర్ అయింది. ఆ షో చూసిన తర్వాతే చాలామందికి బాలకృష్ణ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది.

అప్పటివరకు బాలకృష్ణ ఫ్యాన్స్ ని కొడతారు, స్టేజ్ మీద మాట్లాడటం రాదు ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా వినిపించేవి. కానీ ఆ షో జరిగిన తర్వాత యంగ్ హీరోస్తో ఎంత క్లోజ్ గా ఉంటారు. తనకు అనిపించిన విషయాన్ని ముక్కు సూటిగా ఎలా చెబుతారు అనే విషయాలు పైన చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన అఖండ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

Advertisement

అఖండ సినిమా కంటే ముందు వచ్చిన కొన్ని సినిమాలు వరుస డిజాస్టర్లు. ఏ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి కూడా వచ్చేసింది. ఆ తరుణంలో అన్ స్టాపబుల్ షో అంతా మార్చేసింది.

మద్రాస్ నా జన్మభూమి 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాకముందు మద్రాస్ లో ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు వంటి హీరోలు ఎక్కువ చెన్నైలో ఉంటూనే సినిమాలు చేసేవారు. ఆ తరువాత కాలంలో ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది.

Advertisement

అయితే నందమూరి బాలకృష్ణ మద్రాసులోనే పుట్టారు. అందుకనే రీసెంట్గా అఖండ 2 సినిమా తమిళ్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ మద్రాస్ నా జన్మభూమి. తెలంగాణ నా కర్మభూమి. ఆంధ్రప్రదేశ్ నా ఆత్మ భూమి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

పాన్ ఇండియా సినిమా 

బాలకృష్ణ క్రేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఇక అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. అలానే ఆ స్థాయి కంటెంట్ కూడా సినిమాలో ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి కొన్ని కాంట్రవర్సీలు కూడా జరుగుతున్నాయి. దుబాయ్ లో ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ ప్రాబ్లం కూడా వచ్చింది.

మామూలుగా తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను కూడా ఆదరిస్తారు. తమిళ హీరోల సినిమాలకి కూడా ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుంది. కానీ కొంతమంది తెలుగు హీరోల సినిమాలకు సంబంధించి అక్కడ థియేటర్స్ కూడా దొరకవు. మరి అఖండ సినిమాకు ఏ స్థాయిలో యాక్సెప్టెన్స్ వస్తుందో చూడాలి.

Also Read: Megastar Chiranjeevi : బ్రదర్ వెంకటేష్ ఆ పది రోజుల నేను మర్చిపోలేను, విక్టరీ పై మెగాస్టార్ కామెంట్స్

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×