E-Paper
Advertisement

The Raja Saab: ది రాజా సాబ్ మూవీపై కుట్రలు… మారుతిపై ప్రతీకారమేనా?

The Raja Saab: ది రాజా సాబ్ మూవీపై కుట్రలు… మారుతిపై ప్రతీకారమేనా?
Advertisement

Maruthi: టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) ఇదివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) తో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడంతో ఒక్క సారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో మారుతికి అవకాశం ఇవ్వడం ఏంటి అంటూ మొదటి నుంచి కూడా సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈయన పట్ల పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇక మారుతి వీటన్నింటినీ ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో తనని నమ్మి సినిమా అవకాశం ఇస్తే ఎలాగైనా ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే సినిమా కోసం కష్టపడ్డారు.

రాజా సాబ్ కోసం మూడేళ్లు..

ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు పాటు కష్టపడిన మారుతి ఎంతో విజయవంతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక డైరెక్టర్ మారుతి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు కావలసినంత ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను బయటపెట్టారు.

సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు..

Advertisement

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో మారుతి పై జరుగుతున్న కుట్ర గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. చాలామంది ప్రభాస్ తో మీరు చేస్తున్న ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు మీపై కుట్ర చేస్తున్నారు అంటూ ప్రశ్న వేయడంతో ఈ ప్రశ్నకు మారుతి సమాధానం చెబుతూ… నాపై కుట్రని కాదు కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నారని తెలియజేశారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం. అలాంటిది ఆయనతో సినిమా చేసి సక్సెస్ అయితే వీడు మన మాట వినరనే భావనలో చాలామంది ఉన్నారు అందుకే నా సినిమా ఫెయిల్ కావాలని కోరుకుంటున్నారని మారుతి తెలిపారు.

Also Read:  Director Maruthi:”నాకు అర్హత లేదు’.. ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో కామెంట్‌పై మారుతి రియాక్షన్

Advertisement

మారుతి పై కుట్ర..

ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎంతమంది కోరుకున్న జరగదని, కథ నచ్చితే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని తెలియజేశారు. ఇలా సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవడం వల్ల వాళ్లకి వచ్చే లాభం ఏమాత్రం లేదు కానీ నేను మరోసారి పడిపోతే చూడాలని మాత్రమే కోరుకుంటున్నారంటూ ఈయన తెలియజేశారు. మరి మారుతి సక్సెస్ ను జీర్ణించుకోలేకపోతున్న వారెవరో తెలియాల్సి ఉంది.. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కూడా ప్రభాస్ పాత్ర హైలెట్  ఉంటుందని చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నారని మారుతి తెలియజేశారు.

Also Read: Actors Married in 2025: 2025లో పెళ్లి చేసుకుని ఇంటివాళ్లు అయిన సెలబ్రిటీలు వీళ్లే..

Related News

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×