E-Paper
Advertisement

Actors Married in 2025: 2025లో పెళ్లి చేసుకుని ఇంటివాళ్లు అయిన సెలబ్రిటీలు వీళ్లే..

Actors Married in 2025: 2025లో పెళ్లి చేసుకుని ఇంటివాళ్లు అయిన సెలబ్రిటీలు వీళ్లే..
Advertisement

Actors Married in 2025: 2025వ సంవత్సరం మరికొన్ని గంటలలో పూర్తి కానుంది. ఈ తరుణంలోనే కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం పలకబోతున్నాము. ఇప్పటికే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2025వ సంవత్సరం మరికొన్ని గంటలలో పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇండస్ట్రీలో జరిగిన సంఘటనలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2025వ సంవత్సరంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మరి ఆ జంటలు ఎవరో ఓ లుక్ వేసేద్దాం..

2025లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

అఖిల్ – జైనాబ్: అక్కినేని వారసుడు అఖిల్ ఈ ఏడాది జూన్ 6వ తేదీ తన ప్రేయసి జైనాబ్ ను  ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

Advertisement

సమంత – రాజ్:  సినీనటి సమంత ఈ ఏడాది రెండోసారి వివాహం చేసుకొని మరో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈమె డిసెంబర్ ఒకటవ తేదీ దర్శకుడు రాజ్ ను వివాహం చేసుకున్నారు.

అవికా గోర్ – మిలింద్: చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ నటి అవికా గోర్ తన ప్రియుడు మిలింద్ చంద్వానితో కలిసి సెప్టెంబర్ 30వ తేదీ ఒక టీవీ షోలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.

Advertisement

నారా రోహిత్ – సిరి: ప్రముఖ టాలీవుడ్ హీరో నారా రోహిత్ సినీనటి సిరిలెల్లాను ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.

సాక్షి అగర్వాల్ – నవనీత్: ప్రముఖ సినీ నటి సాక్షి అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ను జనవరి 2 గోవాలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

అభినయ – కార్తీక్: సినీనటి అభినయ తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నటి అభినయ తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్ ను ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ వివాహం చేసుకున్నారు.

నర్గీస్ ఫక్రి – టోనీ బెయిగ్: నటి నర్గీస్ పక్రి అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త టోనీ బెయిగ్ ను 2025 ఫిబ్రవరిలో లాస్ ఏంజల్స్ లో రహస్యంగా వివాహం జరుపుకున్నారు.

హీనా ఖాన్ – రాఖీ జైస్వాల్: ప్రముఖ నటి హీనా ఖాన్ మరో నిర్మాత రాఖీ జైస్వాల్ ను 2025 జూన్ 4వ తేదీ వివాహం జరుపుకున్నారు.

నార్నే నితిన్ – శివాని: నటుడు నార్ని నితిన్ శివానిల వివాహం కూడా ఈ ఏడాది ఎంతో ఘనంగా జరిగింది ఈ జంట పెద్దల సమక్షంలో అక్టోబర్ 10వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.

సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ – హరిణ్య: సింగర్ రాహుల్ తన ప్రేయసి హరిణ్యాతో కలిసి ఈ ఏడాది ఏడడుగులు వేశారు. ఈ జంట పెద్దల సమక్షంలో ఈ ఏడాది నవంబర్ 27వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.

2025లో నిశ్చితార్థం జరుపుకున్న సెలబ్రిటీలు:

ఈ ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడమే కాకుండా మరి కొంతమంది నిశ్చితార్థం జరుపుకొని కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కొత్త ఏడాదిలో ఒకటి కాబోతున్న ఆ సెలెబ్రెటీలు ఎవరనే విషయానికి వస్తే..

రష్మిక – విజయ్ దేవరకొండ: గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట 2025 అక్టోబర్లో రహస్యంగా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

అల్లు శిరీష్ – నైనిక: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ తన ప్రేయసి నైనిక రెడ్డితో కుటుంబ సభ్యుల సమక్షంలో అక్టోబర్ 30వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ జంట మార్చి ఆరవ తేదీ వివాహం జరుపుకోబోతున్నారు.

విశాల్ – సాయి దన్సిక: ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ తన 47వ పుట్టినరోజు తన ప్రేయసి నటి సాయి దన్సికతో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ ఏడాది వీరి వివాహం జరగబోతోంది.

కార్తీక్ వర్మ దండు – హరిత: విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు హరిత అనే అమ్మాయితో ఈ ఏడాది నిశ్చితార్థం జరుపుకున్నారు. కొత్త ఏడాదిలో వీరి వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు రన్ టైం లాక్.. నిడివి ఎంతంటే?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×