E-Paper
Advertisement

Director Maruthi:”నాకు అర్హత లేదు’.. ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో కామెంట్‌పై మారుతి రియాక్షన్

Director Maruthi:”నాకు అర్హత లేదు’.. ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో కామెంట్‌పై మారుతి రియాక్షన్
Advertisement

Director Maruthi: టాలీవుడ్ దర్శకుడు మారుతి(Maruthi) డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇటీవల చిత్ర బృందం మరో ట్రైలర్ విడుదల చేయగా ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా విషయంలో ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇలా రెండోసారి విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేసింది.

ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో..

Advertisement

చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను ఇలా ఎంటర్టైన్మెంట్ సినిమా ద్వారా చూడబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ మారుతి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ప్రభాస్ గురించి ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ప్రభాస్ మిడ్ రేంజ్ హీరో అంటూ మాట్లాడటంతో ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాన్ ఇండియా స్టార్ హీరో, ఇండియా సినీ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ప్రభాస్ ని పట్టుకుని మిడ్ రేంజ్ హీరో అనడం ఏంటి అంటూ ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవుడితో సమానం..

ఈ విధంగా ప్రభాస్ గురించి మారుతి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తాజాగా స్పందించారు. ఇటీవల కాలంలో నాకు తెలియకుండానే తప్పులు దొర్లుతున్నాయని తెలిపారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నాకు సినిమా అవకాశం ఇస్తే ఆయనకు అన్నీ బాగా చేయాలి అనుకున్న తరుణంలోనే ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని, ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోని అనే అర్హత నాకు లేదని మారుతి తెలిపారు. ఆయన నాకు ఒక దేవుడితో సమానం, అలాంటి వ్యక్తిని తాను ఎందుకు అంటాను అంటూ ఈ సందర్భంగా మారుతి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: Actors Married in 2025: 2025లో పెళ్లి చేసుకుని ఇంటివాళ్లు అయిన సెలబ్రిటీలు వీళ్లే..

ఎన్టీఆర్ ను తక్కువ చేయలేదు..

ఇక గతంలో ఎన్టీఆర్ ని ఉద్దేశించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల ఈ సందర్భంగా స్పందించారు. కాలర్ ఎగరేయడం గురించి తాను ఎన్టీఆర్ ను విమర్శించలేదని తెలిపారు. ది రాజా సాబ్ సినిమా విషయంలో కాలర్ ఎగరేయడం చిన్నది అవుతుందని చెప్పానే తప్ప ఎన్టీఆర్ ను  తక్కువ చేయడం నా ఉద్దేశం కాదని ఈ సందర్భంగా తన గురించి వచ్చిన విమర్శలపై మారుతి క్లారిటీ ఇచ్చారు. మారుతి ప్రభాస్, ఎన్టీఆర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈయన తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు.

Also Read: Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు రన్ టైం లాక్.. నిడివి ఎంతంటే?

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×