E-Paper
Advertisement

CPI Narayana: నేను పైరసీలో సినిమాలు చూస్తాను.. ఐ బొమ్మ రవి పై సీపీఐ నారాయణ కామెంట్స్!

CPI Narayana: నేను పైరసీలో సినిమాలు చూస్తాను.. ఐ బొమ్మ రవి పై సీపీఐ నారాయణ కామెంట్స్!
Advertisement

CPI Narayana: ఐ బొమ్మ రవి (Ibomma Ravi)సినిమాలను పైరసీలకు గురి చేస్తూ పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి నష్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐ బొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసి తనని చంచల్ గూడ జైలుకు పంపించారు. రిమాండ్ లో ఉన్న రవిని పోలీసులు విచారణ చేపడుతూ ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలను పైరసీ చేయడం గురించి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గతంలో సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పైరసీలో సినిమా చూస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే.

నేను ఫ్రీగా సినిమాలు చూశాను..

తాజాగా సిపిఐ నాయకుడు నారాయణ కూడా ఐ బొమ్మ రవి గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తాను కూడా ఐ బొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసానని తెలిపారు. ఒక్కో సినిమా చూడాలి అంటే సుమారు రూ. 600- 700 వరకు ఖర్చు చేయాలి అంత పెట్టి ఎలా సినిమా చూడగలను అందుకే ఐ బొమ్మలో ఫ్రీగా సినిమాలు చూసానని తెలిపారు. అయితే రవి లాంటి వాళ్లు సినిమాలను ఈ విధంగా పైరసీ చేయటానికి కారణం వ్యవస్థలోని లోపాలే అంటూ సిపిఐ నారాయణ మాట్లాడారు.

వేల కోట్లు ఖర్చుపెట్టి సినిమా ఎవరు చేయమన్నారు..

Advertisement

ఇలాంటివారు మరొకరు పుట్టకూడదు అంటే ముందు వ్యవస్థలో ఉన్న ఈ లోపాలను సరిచేయాలని ఈయన తెలియజేశారు. ఐ బొమ్మ రవి సినిమాలను పైరసీ చేశారు అంటూ కొంతమంది ప్రొడ్యూసర్లు ఉరి తీయమని చెబుతున్నారు. ఉరి తీయాల్సింది రవిని కాదని , సినిమా మాఫియా చేస్తున్న వారిని ఉరితీయాలి అంటూ నారాయణ ఘాటుగా మాట్లాడారు. నిర్మాతలు ఒక సినిమా చేయడం కోసం వందలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇలా అధికంగా ఖర్చు చేసే ప్రభుత్వాలు దగ్గరకెళ్ళి మాకు ఇంత ఖర్చయింది సినిమా టికెట్ల రేట్లు పెంచమని వేడుకుంటున్నారు.

లోపం సినిమా వ్యవస్థలో ఉంది..

Advertisement

ఇలా ఇస్టాను సారంగా సినిమా కోసం ఖర్చు చేసే ఆ భారం మొత్తం ప్రజలపై వేస్తున్నారని అందుకే రవి లాంటి వాళ్లు పుట్టారని సిపిఐ నారాయణ తెలిపారు. లోపం రవిలో లేదని సినిమా వ్యవస్థలో ఉందని ఈయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు పైరసీలు ఆగాలి అంటే ప్రజలకు అనుగుణంగా టికెట్ల రేట్లు అందుబాటులో ఉంచాలి. సినిమాని కూడా నిర్ణీత బడ్జెట్ లో పూర్తి చేసినప్పుడే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి సినిమాలను చూస్తారే తప్ప వేళల్లో సినిమా టికెట్ల రేట్లు పెంచితే ఎంతోమంది రవిలు పుట్టుకు వస్తారని నారాయణకు మద్దతుగా ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Akhanda 2 Juke Box: Akhanda 2 Juke Box: అఖండ 2 ఒక్కో పాటకు ఒక్కో స్పెషల్.. మూవీలో మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×