IAS Family Daughter Incident: పాపం ప్రేమించి.. ఇంట్లో వాళ్లని ఎదిరించి ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంది. కానీ రెండు నెలలు గడవక ముందే అసలు రూపం బయటపెట్టాడు. అయితే
ఆంధ్రప్రదేశ్‌లో IASగా పనిచేస్తున్న చిన్న రాముడు కుమార్తె మాధురి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, నవోదయ కాలనీలో తమ నివాసంలో అనుమానాస్పదంగా ఉరి వేసుకొని మృతి చెందారు.
అయితే మాధురి ఎనిమిది నెలల క్రితం రాజేష్ నాయుడు అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత పరువు కోసం తన తండ్రి ఇంటికి తీసుకొచ్చి మళ్లీ వారిద్దరికీ వివాహం చేశాడు. అంత బాగుంది అనుకునే సమయంలో రాజేశ్ అసలు రూపం బయట పెట్టాడు..
రాజేశ్ నాయుడు చాలా పేదవాడు.. కానీ ఆస్తి ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే డబ్బులు వస్తాయి అని ఆశ పడ్డట్లు ఉన్నాడు. దీంతో మాధురిని ప్రేమలో దించాడు.. అనుకున్నట్లు గానే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఒక నెల రోజులు సంతోషంగా జీవించారు.. తర్వాత కట్నం కోసం రోజు వేధించేవాడు అని మాధురి తన అమ్మకు తెలిపింది.. కానీ వారు నమ్మలే.. చివరకు రాజేశ్‌ను వదిలేసి తన పుట్టింటికి వచ్చింది. అయిన తీవ్ర మనస్థాపానికి గురైన మాధురి పెళ్లైన 8 నెలలకే వాళ్ల ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాధురి తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
Also Read: దారుణం.. దత్తత పేరుతో తెచ్చి.. 14 ఏళ్ల బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం
తమ కుమార్తె ఆత్మహత్యకు గల కారణం ఆమె భర్త రాజేష్ నాయుడు వేధింపులేనని మాధురి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. భర్త వేధింపులు భరించలేకనే మాధురి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య కేసులో ట్విస్ట్
ఇప్పుడు ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. మాధురి సూసైడ్‌కి తన పేరెంట్సే కారణం అంటున్న భర్త రాజేష్.. బీటెక్ ఫెయిల్ అయినందుకు తన తల్లిదండ్రులు చంపాలనుకుంటున్నారని, ఇదే విషయాన్ని మాధురి తనకు మెసేజ్ చేసి చెప్పినట్లు రాజేష్ ఆరోపణ చేశారు. మాధురికి బలవంతంగా అబార్షన్ కూడా చేయించారన్న భర్త రాజేష్ నాయుడు తెలిపారు.. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడి కుమార్తె ఆత్మహత్య
కొన్ని నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన రాజేష్ ని కులాంతర వివాహం చేసుకున్న ఐఏఎస్ అధికారి కూతురు మాధురి
పెళ్లి అయిన 4 నెలలకే పుట్టింటికి వచ్చేసిన మాధురి
తన కూతుర్ని రాజేష్ ట్రాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని… pic.twitter.com/1hFlRnXHXL
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2025