E-Paper
Advertisement

Hero Dhanush : కాళ్ల దగ్గర అమ్మాయి.. హీరో ధనుష్‌కి ఎంత అహంకారం.. వీడియో వైరల్..

Hero Dhanush : కాళ్ల దగ్గర అమ్మాయి.. హీరో ధనుష్‌కి ఎంత అహంకారం.. వీడియో వైరల్..
Advertisement

Hero Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళ ఇండస్ట్రీలో ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. దాంతో ఇక్కడ కూడా ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే.. తెలుగులో కూడా సినిమాలు చేసి బిగ్గెస్ట్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది కుబేర మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బాలీవుడ్ లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటించాడు. ఆ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ధనుష్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన వారంతా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూసేద్దాం..

ధనుష్ కాళ్ల దగ్గర అమ్మాయి..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధనుష్ ఒక ఈవెంట్ కోసం కారు దిగి నిలబడి ఉంటాడు. అతని వెనుక నుంచి ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి అతని ప్యాంట్‌ పైకి వెళితే దాన్ని సరిచేస్తూ ఉంటుంది. అంతేకాదు అతని షర్ట్ ను కూడా ఆ అమ్మాయి సరిచేస్తుంది. ధనుష్ మాత్రం ఆమెను గమనించనట్లుగా ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న వాళ్లు ఈ వీడియోను రికార్డు చేస్తారు. సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేస్తాడు.. అతని అవుట్‌ఫిట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి అసిస్టెంట్ ఎలా పరుగెడుతుందో చూడండి అని క్యాప్షన్లు పెట్టారు.. అతను ఫ్యాంట్ వేసుకుంటే సరిచెయ్యడానికి కూడా మనిషిని పెట్టుకున్నాడు. ఎంత అహంకారమో చూడండి అంటూ మరొకరు కామెంట్ చేశారు.. అతనికి ఈ వీడియో పై కామెంట్లతో వస్తున్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Advertisement

Also Read : తొక్కిసలాటకు ఏడాది.. ఇంకా బెడ్ మీదనే శ్రీతేజ్.. గాలికి వదిలేసిన అల్లు అర్జున్..

ధనుష్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..? 

ప్రస్తుతం ధనుష్ కు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో పాటుగా ట్రోల్స్ కూడా నెట్టింట వినిపించడంతో ఆయన ఫ్యాన్స్ రంగప్రవేశం చేశారు. ఆ వీడియోలో ఉన్నది ఎవరో పనిమనిషి కాదని, ఆ అమ్మాయి ధనుష్ పర్సనల్ స్టైలిస్ట్ కావ్య శ్రీరామ్ అని స్పష్టం చేశారు.. ఆమె ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ కాబట్టే తన పనిని తాను చేసింది అందులో తప్పేముంది? అంటూ ధనుష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. నటుడికి, సిబ్బందికి మధ్య ఇంతటి గౌరవప్రదమైన బంధం చూడటం చాలా ఆనందంగా ఉంది. నిజాలు తెలియకుండా విషం చిమ్మడం ఆపండి అంటూ మరో అభిమాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై హీరో ధనుష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఇకపోతే ధనుష్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే వాటి గురించి ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×