E-Paper
Advertisement

Pushpa 2 Stampade : తొక్కిసలాటకు ఏడాది.. ఇంకా బెడ్ మీదనే శ్రీతేజ్.. గాలికి వదిలేసిన అల్లు అర్జున్..

Pushpa 2 Stampade : తొక్కిసలాటకు ఏడాది.. ఇంకా బెడ్ మీదనే శ్రీతేజ్.. గాలికి వదిలేసిన అల్లు అర్జున్..
Advertisement

Pushpa 2 Stampade : గత ఏడాది సరిగ్గా ఇదే రోజున హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఇదే రోజున థియేటర్లలోకి వచ్చేసింది. అభిమాన హీరో సినిమా చూసేందుకు ఓ బాలుడు ప్రీమియర్ షోకి వచ్చాడు. అతనికి సినిమాపై ఉండే మక్కువ అతని జీవితాన్నే కాటు వేసింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియేటర్ లో సినిమాను చూసేందుకు తల్లితో కలిసి వెళ్లిన పసివాడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నాడు.. థియేటర్ కు సడెన్గా హీరో రావడంతో జరిగిన తొక్కిసలాటలో బాలుడు తల్లిని కోల్పోయాడు. కుర్రాడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఘటన తర్వాత పిల్లాడిని ఆదుకుంటామని చెప్పిన పుష్ప 2 టీమ్ ఇప్పుడు పట్టించుకోలేదని తెలుస్తుంది. అన్నీ తానై చూసుకుంటానని మాటిచ్చిన హీరో మౌనం వహింస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఏడాది దాటినా శ్రీతేజ్ ఆరోగ్యం పై మార్పు కనిపించడం లేదు.. ప్రస్తుతం ఆ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం..

ఏడాది అవుతున్న శ్రీతేజ్ పరిస్థితి మారలేదా..? 

ఒక సినిమాలు పిల్లాడి జీవితాన్ని మార్చేసింది.. అతని కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లాడు మంచానికే పరిమితం అయ్యాడు.. సినిమా అంటే ఇష్టం, హీరో పై అభిమానం ఉండటం తప్పా..? సరిగ్గా ఏడాది క్రితం సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. శ్రీతేజ్, తల్లి తొక్కిసలాట వల్ల ఊపిరి ఆడక అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. శ్రీతేజ్ కొన ఊపిరితో ప్రాణాలతో పోరాడుతున్నాడు. డిసెంబర్ 4 న జరిగిన తెలుగు రాష్ట్రాల ప్రజలను కన్నీళ్లు పెట్టింది. సంవత్సరం నుంచి శ్రీతేజ్ అలానే ఉన్నాడు. ఆస్పత్రి నుంచి శ్రీతేజ్ఆరు నెలల కిందట డిశ్చార్జి అయ్యాడు కానీ, అతని ఇల్లే ఇప్పుడు దవాఖానాగా మారింది. తండ్రి నర్సు అయి నిరంతరం సపర్యలు చేస్తున్నారు.. ఆకలి అని సైగ కూడా చేయలేడు. తొక్కిస లాటలో చిన్నారి మెదడు కణాలు 70 శాతం దెబ్బతినడమే ఇందుకు కారణం.. ఇప్పటికీ తండ్రి పసిపాపలా కొడుకు మళ్లీ మామూలు వాడవుతాడని ఎదురుచూస్తున్నారు.. ఆ ఆశతో బ్రతుకుతున్నాడు.. మరి ఇప్పటికైన శ్రీతేజ్ పరిస్థితి మారుతుందేమో అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఇంకెన్ని రోజులు పిల్లాడు అలానే ఉంటాడో ఆ భగవంతుడికే తెలియాలి..

 శ్రీతేజ్ విషయంలో మాట తప్పిన అల్లు అర్జున్.. 

Advertisement

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 రిలీజైంది. ఈ మూవీ ప్రీమియర్ షో టైం లోనే ఈ ఘటన జరిగింది. ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా హీరో థియేటర్ వద్ద చేరుకోవడంతో అభిమానులు చూసేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది.. అప్పటినుంచి శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇప్పటికి అలానే ఉన్నాడు. తనవల్లే తొక్కేసలాట జరిగిందని అల్లు అర్జున్ ఆ పిల్లాడు మళ్లీ కోలుకొని మామూలు మనిషి అయ్యేవరకు అన్ని దగ్గరుండి చూసుకుంటానని మాట ఇచ్చాడు.. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ సాయం అందించడం మాట అంటుంచితే పిల్లాడి గురించి కనీసం అడగలేదని తెలుస్తుంది.. ఈ ఘటన జరిగి ఏడాదైనా కూడా ఆ కుర్రాడి పరిస్థితి అలానే ఉంది. ఇప్పటికైన అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక చూడాలి అల్లు అర్జున్ స్పందిస్తారేమో..

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×