E-Paper
Advertisement

Isha Glimpse: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈషా గ్లింప్స్.. భయపడే వారు అస్సలు చూడొద్దు!

Isha Glimpse: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈషా గ్లింప్స్.. భయపడే వారు అస్సలు చూడొద్దు!
Advertisement

Isha Glimpse: ఇటీవల కాలంలో హర్రర్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా హర్రర్ థ్రిల్లర్ జానెర్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరికొత్తగా మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తాజాగా మరో హర్రర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఇటీవల కాలంలో బన్నీ వాసు(Bunny Vasu) తన కొత్త నిర్మాణ సంస్థ అయినా బీవీ వర్క్స్ నుంచి విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ వరుస హిట్ సినిమాలను అందుకుంటున్నారు.. ఇకపోతే తాజాగా మరో సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

విడుదలకు సిద్ధమైన ఈషా..

బన్నీ వాసు సమర్పణలో శ్రీనివాస మన్నే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈషా(Isha) అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అందరిని ఎంతో భయభ్రాంతులకు గురిచేస్తుంది.

నిజంగానే ఆత్మలు ఉన్నాయా..

Advertisement

నిజంగానే ఆత్మలు ఉన్నాయా అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ప్రతిక్షణం ట్విస్ట్ లతో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇలా ఈ గ్లింప్ వీడియో చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఈ సినిమాని అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. డిసెంబర్ 12వ తేదీ ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ సినిమాలకు పోటీగా బన్ని వాసు సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాలో త్రిగుణ్, హెబ్బా పటేల్(hebah patel) అఖిల్ రాజ్ ,సిరి హనుమంత్, పృథ్వి రాజ్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు.

Advertisement

ఇక గ్లింపు వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదివరకే ఈ నిర్మాణంలో లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి బన్నీ వాసు సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈషా సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది. ఇలా ఉన్నపలంగా ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదలవుతున్న సినిమాలకు పోటీగా బరిలో దిగబోతోంది. విడుదల సమయం తక్కువగా ఉన్నప్పటికీ కంటెంట్ పై నమ్మకంతోనే డిసెంబర్ 12వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు నిర్మాత బన్నివాసు ఈ గ్లింప్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు.

Also Read: Akhanda 2 : బాలయ్యకు ఘోర అవమానం.. ఆ ఏరియాలో పట్టుమని పది షోలు కూడా పడలే..

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×