E-Paper
Advertisement

IBOMMA : ఐబొమ్మ, బప్పం టీవీ అకౌంట్స్ క్లోజ్.. సవాల్ కు పోలీసుల రివేంజ్..

IBOMMA : ఐబొమ్మ, బప్పం టీవీ అకౌంట్స్ క్లోజ్.. సవాల్ కు పోలీసుల రివేంజ్..
Advertisement

IBOMMA : కొత్త మూవీలను ఫైరసి చేసి ఆన్లైన్లో లీక్ చేస్తున్న ప్రముఖ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఇండస్ట్రీ థియేటర్లలో రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజే పైరసీకి గురై ఆన్లైన్లోకి వచ్చేస్తున్నాయి.. అలా సినిమాలని రిలీజ్ చేస్తున్న ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుని పోలీసులు ఎంతో చాకచాక్యంగా పక్కా ప్రణాళికతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ని రిమాండ్ కి తరలించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఆయన అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు. తాజాగా రవి హ్యాండిల్ చేస్తున్న ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించినట్లు తెలుస్తుంది. పోలీసులకు సవాల్ గా మారిని రవిని పోలీసులు అరెస్ట్ చెయ్యడం మాత్రమే కాదు, అతని చేతనే ఈ వెబ్ సైట్స్ ను క్లోజ్ చేయించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసుల పై పలువురు ప్రశంసంలు కురిపిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలను పోలీసులు వెళ్లడించాల్సి ఉంది. త్వరలోనే పోలీసులు మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం..

పోలీసులా.. మజాకా.. 

గత కొన్నేళ్లుగా సినిమాలను ఫైరసి చేస్తూ కోట్లు సంపాదిస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులకు తల నొప్పిగా మారాడు. సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని పక్కా ప్లాన్ ప్రకారమే అరెస్ట్ చేశారు. మొన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు రవి వచ్చినట్లు పక్కా సమాచారంతో అతడి ఇంటి దగ్గర నిఘా పెట్టి అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కొన్ని నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రవిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు అని సవాల్ విసిరిన రవికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అతన్ని పట్టుకోవడానికి అతని భార్య సహకారం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఏది ఏమైన తెలంగాణ పోలీసుల ప్రతిభ పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆ వెబ్ సైట్లు ఇక పనిచెయ్యవు.. 

Advertisement

తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని శనివారం అరెస్టు చేశారు.. అతని పర్సనల్ అకౌంట్స్ ను సీజ్ చేశారు. అంతేకాదు రిమాండ్ కు తరలించారు. అతడితోనే వెబ్సైట్లను మూసివేయించారు. వెబ్ సైట్ లాగిన్స్, సర్వర్ వివరాలతో చర్యలు తీసుకున్నారు. అతను హైదరాబాద్ లో ఉండడు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వహణకు పాల్పడుతున్నాడు. ఐబొమ్మ వెబ్ సైట్ మొత్తం పైరసీ, ఓటీటీలు ఉంటాయి. అయితే సినిమాలు ఫైరసి అవ్వడంతో తెలుగు సినీ నిర్మాతలు ఆ వెబ్సైట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కాగా, గతంలో ఈ రవి దమ్ముంటే నన్ను పట్టుకుని అంటూ సవాల్ విసిరాడు. తెలంగాణ పోలీసులు అతని సవాన్ని స్వీకరించి హైదరాబాద్ కు చేరుకున్నారు రవిని అరెస్ట్ చేసి షాకిచ్చారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని చెక్ చేస్తున్నారు. నాంపల్లి కోర్టులో సోమవారం ఫిటిషన్ దాఖలు చెయ్యనున్నట్లు సమాచారం..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×