E-Paper
Advertisement

Telangana politics: ఎమ్మెల్యే నవీ‌న్ యాదవ్‌‌కు బంపరాఫర్.. రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి?

Telangana politics: ఎమ్మెల్యే నవీ‌న్ యాదవ్‌‌కు బంపరాఫర్.. రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి?
Advertisement

Telangana politics: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జోరుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొనసాగించాలని పాలకపక్షం భావిస్తోందా? ఉప ఎన్నిక ముందు అనుసరించిన వ్యూహాలను అమలు చేయాలని  ఆలోచన చేస్తుందా?  ఈ క్రమంలో ఎమ్మెల్యే అయిన నవీన్‌యాదవ్ కీలక పదవి అప్పగించే అవకాశాలున్నాయా? ఇంతకీ గాంధీభవన్ వర్గాలు ఏం చెబుతున్నాయి.

నవీ‌న్ యాదవ్‌‌కు బంపరాఫర్

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రెండేళ్లు అయ్యేసరికి ఉప ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఘన విజయంతో గ్రేటర్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు సంకేతాలు వస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికకు ముందు ఆ నేతలు కండువా కప్పుకోవాలని భావిస్తున్నట్లు గాంధీ‌భవన్ వర్గాల మాట. ఇందుకు కారణాలు సైతం లేకపోలేదు. రేవంత్ ప్రభుత్వంతో ఫైట్ చేయడం కేటీఆర్‌కి కష్టమని కొందరు నేతలు తేల్చేశారట. సీఎం రేవంత్ ఎత్తుల ముందు ఆయన తేలిపోతున్నారని అంటున్నారు.

Advertisement

కీలక పదవి దక్కే ఛాన్స్?.. ఇక గ్రేటర్‌పై ఫోకస్

ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మనుగడ ఉండాలంటే జంప్ చేయడం ఖాయమన్నది కొందరి నేతల మాట. గ్రేటర్ ఎన్నికలకు ముందు వెళ్తే ఫలితాలు ఉంటాయని, ఆ తర్వాత వెళ్లినా ఒక్కటే.. వెళ్లకపోయినా ఒక్కటేనని అంటున్నారు.  జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు రేవంత్ సర్కార్‌లో కీలక పదవి దక్కే అవకాశముంది.

ఈ మేరకు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కొద్దిరోజుల గ్యాప్‌లో కీలక పదవి ఆయనకు దక్కనున్నట్లు తెలుస్తోంది. నవీన్‌కు మంత్రి పదవి ఇస్తారా? లేకుంటే విప్ తరహాలో మరో పదవి ఇస్తారా? అనేది అసలు చర్చ.  బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్‌కు పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ALSO READ:  జూబ్లీహిల్స్ ఫలితం.. తెలంగాణ బీజేపీలో మొదలైంది రచ్చ

ఇటీవల అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి ఇస్తారా? దానికి సమాంతరంగా మరో పదవి ఇస్తారా? అనేదానిపై రకరకాలుగా గాంధీభవన్‌లో గుసగుసలు లేకపోలేదు. కొద్దిరోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ పరిధిలో యాదవులు ఎక్కువగా ఉన్నారు.

ఆ సామాజిక వర్గానికి చెందిన నేత నవీన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. దీనివల్ల వచ్చే ఎన్నికల నాటికి గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి నవీన్ అదృష్టం తలుపు తట్టడం ఖాయమని అంటున్నారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×