E-Paper
Advertisement

Varanasi: గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్.. రాజమౌళిపై హిందూ సంఘాలు ఆగ్రహం

Varanasi: గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్.. రాజమౌళిపై హిందూ సంఘాలు ఆగ్రహం
Advertisement

Varanasi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రం టైటిల్ ను నిన్న ‘వారణాసి’ అంటూ రివీల్ చేసిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే.. సినిమా ప్రకటించి ఏడాది అవుతున్నా.. ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూశారు. దీంతో అభిమానుల కోరిక మేరకు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి చేసిన కామెంట్లకు నెటిజన్లతో పాటు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రాజమౌళి పై హిందూ సంఘాలు ఫైర్..

అసలు విషయంలోకి వెళ్తే.. హనుమాన్ రాజమౌళి వెనుక ఉండి ఈ సినిమా తీయించారని చిత్ర రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ విషయాన్ని రాజమౌళి గుర్తు చేసుకుంటూ.. “టెక్నికల్ గ్లిచ్ వల్ల గ్లింప్స్ ఆలస్యం కావడంతో నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు.. హనుమాన్ వెనుకాల ఉంటాడని మా నాన్న చెప్పారు.ఇలా అన్న వెంటనే కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అని అన్నాను “అంటూ రాజమౌళి కామెంట్లు చేశారు. అయితే రాజమౌళి చేసిన ఈ కామెంట్లకు ఇప్పుడు నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. సమస్య నీది…ఈ చిన్న సమస్యకు దేవుడిని అనడం ఏంటి? అంటూ నెటిజన్లతో పాటు హనుమాన్ దేవుడిని కించపరిచేలా మాట్లాడాడు అంటూ హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది..

Advertisement

also read:Bigg Boss 9: మరో సర్ప్రైజ్ ఎలిమినేషన్… శనివారం ఎపిసోడ్‌లో ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ 

వారణాసి సినిమా విశేషాలు..

వారణాసి సినిమా విషయానికి వస్తే.. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ సుమారుగా 1200 కోట్లు బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా.. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి వచ్చిన తొలి అప్డేట్ కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ దే కావడం గమనార్హం. ఇందులో ఆయన కుంభ పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేశారు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.

Advertisement

ఆ తర్వాత గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇందులో మందాకిని అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తుంది. ఈమె ఫస్ట్ లుక్ విషయానికి వస్తే చీర కట్టులో గన్ను పట్టుకుని యాక్షన్ పర్ఫామెన్స్ ఇస్తున్నట్టుగా ఆ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక మహేష్ బాబు పాత్ర విషయానికి వస్తే.. ఇందులో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నట్లు నిన్న ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఇక ఎద్దు పై ఆయన కూర్చుని వస్తున్న గ్లింప్స్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పించేసాయి. అలా మొత్తానికైతే ఈ సినిమా ఇప్పుడు అంచనాలను పెంచేసింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×