E-Paper
Advertisement

టాలీవుడ్ డైరెక్టర్ బాగోతం..బాడీ పార్ట్స్ టచ్ చేస్తూ.. సల్మాన్ హీరోయిన్‌కు నరకం!

టాలీవుడ్ డైరెక్టర్ బాగోతం..బాడీ పార్ట్స్ టచ్ చేస్తూ.. సల్మాన్ హీరోయిన్‌కు నరకం!
Advertisement

Daisy Shah :సినిమా ఇండస్ట్రీలో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ మంటలు రేగుతున్నాయ్. సెలబ్రిటీ హోదా ఉన్నా హీరోయిన్లు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్‌కు ఎలా బలైపోతున్నారో డైసీ షా ఘటన చూస్తే అర్థమైపోతుంది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు, ఒక సౌత్ డైరెక్టర్ నుంచి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆడిషన్ పేరుతో గదిలోకి పిలిచి ఆ డైరెక్టర్ చేసిన వెకిలి చేష్టలు వింటే ఒళ్లు గగుర్పాటు కావాలిసిందే.

విడివిడిగా పిలిచి.. వింత కోరికలతో వేధింపులు!

Advertisement

డైసీ షా చెబుతున్నదాని ప్రకారం.. సదరు దర్శకుడు ముంబైలోని ఒక హోటల్‌లో కాస్టింగ్ సెషన్ ఏర్పాటు చేశాడు. ఆరుగురు అమ్మాయిలు ఆడిషన్స్ కోసం వెళ్లగా, ఆయన మాత్రం అందరినీ కాకుండా “పర్సనల్”గా ఒక్కొక్కరినే కలవాలని కండిషన్ పెట్టాడు.“ఆ డైరెక్టర్ ప్రవర్తన మొదటి నుంచే తేడాగా ఉంది. నన్ను లోపలికి పిలిచి నా బాడీని అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. నా చేయి పట్టుకుని వదలలేదు. కాస్టింగ్ పేరుతో అతను చేస్తున్న పనులు చూసి నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు ఒక డైరెక్టర్ స్థానంలో ఉండి అలా ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నేను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేను” అంటూ తన ఆవేదనను బయటపెట్టింది డైసీ షా.

మసాజ్ కూడా చేయించుకోను.. అలాంటిది వాడు నన్ను తాకడమా?

Advertisement

డైసీ మాట్లాడుతూ..“నాకు ఎవరైనా టచ్ చేస్తేనే అస్సలు నచ్చదు. కనీసం ఒక మహిళతో మసాజ్ చేయించుకోవడానికి కూడా నేను ఒప్పుకోను. అలాంటిది ముక్కూ మొహం తెలీని వ్యక్తి నా అనుమతి లేకుండా నా శరీరాన్ని తాకడం నాకు తీవ్ర అసహ్యం కలిగించింది. అక్కడ ఉంటే ఇంకేం జరుగుతుందో అని భయం వేసి, ఎలాగోలా తెలివిగా అబద్ధం చెప్పి అక్కడి నుంచి బయటపడిపోయాను” అని చెప్పుకొచ్చింది.

ముంబైలో సౌత్ డైరెక్టర్ల వేషాలు.. టార్గెట్ లో ఆ దర్శకుడు ఎవరు?

ఈ ఘటన ముంబైలో జరగడం, సదరు వ్యక్తి సౌత్ ఇండియాకు చెందిన డైరెక్టర్ అని తెలియడంతో ఇప్పుడు అందరి కళ్లు టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులపై పడ్డాయి. గతంలో డైసీ షా కన్నడలో ‘భద్ర’, ‘బాడీగార్డ్’ వంటి సినిమాలు చేసింది. దీంతో ఆమెను టార్గెట్ చేసిన ఆ కామాంధుడు ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. హీరోయిన్లను వేధిస్తూ తమ పాడు కోరికలు తీర్చుకోవాలనుకునే ఇలాంటి డైరెక్టర్ల వల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సల్మాన్ ఖాన్ అండ ఉన్నా వదలలేదా?

సల్మాన్ ఖాన్ సరసన ‘జై హో’లో నటించి, ‘హేట్ స్టోరీ 3’ వంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న డైసీ షాకు ఇలాంటి అనుభవం ఎదురైందంటే సామాన్య అమ్మాయిల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గణేష్ ఆచార్య వద్ద అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టి, నేడు ‘రెడ్ రూమ్’ వెబ్ సిరీస్‌తో మళ్లీ వార్తల్లో నిలిచిన డైసీ, ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని బయటపెట్టి ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది.చూడాలి మరి ముందు ముందు అయినా ఆ డైరెక్టర్ పేరు బయటపడుతుందో!

also read:‘రారా ధీవర’ అంటూ రచ్చ లేపుతున్న నిఖిల్.. స్వయంభూ’ ఫస్ట్ సింగిల్ షేక్

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×