Horror Thriller OTT : రీసెంట్ గా ఒక సూపర్ నేచురల్ హారర్ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను బాగా భయపెడుతోంది. క్షుద్ర పూజలు, ప్రతీకారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో గ్రాఫిక్స్ కంటే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్, మేకప్‌తోనే భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా, ఎందుకంటే ఇందులో హింస, బూతులు ఎక్కువగా ఉంటాయి. హారర్ సినిమాల్లో ఒక వెరైటీ బ్లాక్ మ్యాజిక్ నేపథ్యం కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘బ్యాడ్ వూడూ’ (Bad Voodoo). దీనికి ఆండ్రూ అడ్లెర్, ఆండ్రే హెప్బర్న్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పాత కాలపు హారర్ సినిమాల స్టైల్‌లో కనిపించేలా 16mm ఫిలిం మీద షూట్ చేశారు. అందుకే విజువల్స్ కాస్త రఫ్‌గా ఉండి భయాన్ని కలిగిస్తాయి. ఇందులో జాన్ ఫియోర్, మ్యానీ పెరెజ్ లాంటి సీనియర్ నటులు నటించగా, డెస్క్‌పాప్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ దీనిని డిస్ట్రబ్యూట్ చేసింది. కేవలం ఒకటిన్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమా, తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ ఇందులోని మేకప్, వింత శబ్దాలు ప్రేక్షకులను వణికించేలా ఉంటాయి. 2026 ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం Apple TV, Prime Video వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.
జైలు నుంచి తప్పించుకున్న నలుగురు దొంగలు, పోలీసుల కళ్లు గప్పి దాక్కోవడానికి ఒక ఊరు చివర ఉన్న పాత ఇంటిలోకి చొరబడతారు. అక్కడ అబిగైల్ అనే ఒక మహిళ నోరు మూసి బందీగా చేసుకుంటారు. హాయిగా ఇక్కడ దాక్కుని, తెల్లారాక చెక్కేద్దాం అని ఆ దొంగలు ప్లాన్ వేస్తారు. కానీ ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదని, అక్కడ చావు కేకలు వినిపిస్తాయని వాళ్లకి అప్పుడు తెలీదు. తీరా చూస్తే, ఆ అబిగైల్ దంపతులు తమ బిడ్డల చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ‘వూడూ’ అనే భయంకరమైన క్షుద్ర పూజలు చేసి దయ్యాలను తమ అధీనంలో ఉంచుకుని ఉంటారు.
ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఈ దొంగలకి ఒక్కొక్కడికి చుక్కలు కనిపిస్తాయి. ఆత్మలు వీళ్లని వేటాడటం మొదలుపెడతాయి. తప్పించుకుందామన్నా దారి దొరకదు, దాక్కుందామన్నా చావు వదలదు. లోపలికి వెళ్లిన ఆ నలుగురు దొంగలు ఆ క్షుద్ర శక్తుల చేతిలో నలిగిపోతారు. రక్తం కూడా ఏరులై పారుతుంది. చివరికి ఆ ఇంట్లో నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా ? ఆ వూడూ శక్తులకు బలైపోతారా ? అన్నది సినిమా చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
Read Also : పడకగదిలో చిచ్చు పెట్టిన మాయావి… ప్రేమించిన భార్యను కాదని మరో అమ్మాయి మోజులో భర్త… అన్నీ అలాంటి సీన్లే