E-Paper
Advertisement

DDLJ అరుదైన రికార్డ్.. నెట్టింట షారుఖ్ ఫ్యాన్స్ రచ్చ!

DDLJ అరుదైన రికార్డ్.. నెట్టింట షారుఖ్ ఫ్యాన్స్ రచ్చ!
Advertisement

DDLJ Movie :కొన్ని సినిమాలు కలెక్షన్లు కొల్లగొడుతాయ్…మరికొన్ని సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయి.కాని అతి కొద్ది సినిమాలే అజారమరంగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయ్.అలాంటి సినిమానే 1995,అక్టోబర్20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’. (DDLJ)..అంటూ ముద్దుగా పిల్చుకునే ఈ సినిమాని ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా యష్ చోప్రా ప్రొడ్యూస్ చేశారు.రాజ్ గా షారుక్-సిమ్రాన్ గా కాజల్ జంటగా నటించిన లవ్ స్టొరీ వచ్చి 30ఏళ్లు దాటినా ఇంకా వైబ్ ఇస్తుందంటే సినిమా ఎంతలా ఇంపాక్ట్ చూపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమా రిలీజ్ అయి 30ఏళ్లు అయినా ముంబైలోని మరాఠా మందిర్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుండటం విశేషం.ఇక లండన్ వీధుల్లో ఈ సినిమా జంట విగ్రహాలు ఉన్నాయంటే సినిమా పవర్ ఏంటో తెల్సిపోతుంది.

సినిమాని ఆకాశానికి ఎత్తేసిన ఆస్కార్ అకాడమీ

Advertisement

ఇవన్ని ఇలా ఉంటె తాజాగా ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే టాప్ రొమాంటిక్ సినిమాలపై ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’.ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులను అందించే ఈ’ఆస్కార్ అకాడమీ'(TheAcademy)హాలీవుడ్ సినిమాలైన ‘ది హాలిడే’,‘ఈట్ ప్రే లవ్’ వంటి సినిమాలతో పాటు DDLJని ప్రస్తావిస్తూ ఫోటోను షేర్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.ఆ పోస్ట్ లో యూరప్ ట్రిప్,ఆ ట్రైన్ జర్నీ,ఆ పరిచయం..ఇవన్నీ “ఎవర్ గ్రీన్” అంటూ సినిమాని ఆకాశానికి ఎత్తేసింది ఆస్కార్ అకాడమీ.

also read:మధుబాల బయోపిక్..‘ఆ స్థాయిని కళ్యాణి ప్రియదర్శన్ అందుకోగలదా.. రిస్క్ చేస్తున్న భన్సాలీ ?

Advertisement

ఇది ఒకరకంగా ఇండియన్ సినిమాకి దక్కిన గౌరవం అని చెప్పకతప్పదు.ఇక అకాడమీ ఇలా పోస్ట్ పెట్టిందో లేదో తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యింది సినిమా హీరోయిన్ కాజోల్.”వరల్డ్ బెస్ట్ లవ్ స్టోరీ ఏదంటే..నేను నిస్సందేహంగా DDLJకే ఓటు వేస్తాను”అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమాపై లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకొచ్చింది ఈ సిమ్రాన్.ఇక దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’కి ఇలా అరుదైన గౌరవం దక్కడంతో “బాద్‌షా ఈజ్ గ్లోబల్”అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు క్రియేట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు షారుఖ్ ఖాన్ అభిమానులు.మరి ఈ పోస్ట్ పై హీరోగా నటించిన షారుక్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

ఈ సినిమా విజయానికి అదే రీజన్ 

సినిమా కథ విషయానికి వస్తే ట్రెడిషనల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి సిమ్రాన్ కి చిన్నప్పుడే తన మిత్రుడి కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశానని చెబుతాడు తండ్రి చౌదరి బల్దేవ్ సింగ్.అయితే పెళ్లికి ముందు తన స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లడానికి తండ్రిని ఒప్పించి సిమ్రాన్ వెళ్ళడం,అదే ట్రిప్‌లో అల్లరిగా ఆటపట్టించే ధనవంతుడైన రాజ్‌ను కలుస్తుంది.మొదట్లో ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ,గొడవ పడుతూ సాగే వీరి ప్రయాణం,చివరకు ప్రేమగా మారుతుంది.అయితే అప్పటికే సిమ్రాన్ పెళ్లి నిర్ణయం అయి ఉండటంతో ఇండియాకి వచ్చేస్తుంది సిమ్రాన్.

ఇక హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో వస్తాడని చెప్పక్కర్లేదనుకుంటా.అయితే అన్ని సినిమాల్లోలా అమ్మాయిని ఎత్తుకుపోకుండా కుటుంబాన్ని ఒప్పించి తన ప్రేమని గెలిపించుకుంటాడు రాజ్.అప్పటి వరకున్న రొటీన్ ఫార్ములాకి భిన్నంగా ఇలా కుటుంబాన్ని ఒప్పించి అమ్మాయిని దక్కించుకోవడమే ఈ సినిమా విజయానికి మెయిన్ రీజన్ అని చెప్పకతప్పదు.

also read:‘థగ్ లైఫ్’ దెబ్బకు రూటు మార్చిన మణిరత్నం.. విజయ్ సేతుపతి, సాయి పల్లవిలు బలికావల్సిందేనా

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×