E-Paper
Advertisement

మధుబాల బయోపిక్..‘ఆ స్థాయిని కళ్యాణి ప్రియదర్శన్ అందుకోగలదా.. రిస్క్ చేస్తున్న భన్సాలీ ?

మధుబాల బయోపిక్..‘ఆ స్థాయిని కళ్యాణి ప్రియదర్శన్ అందుకోగలదా.. రిస్క్ చేస్తున్న భన్సాలీ ?

Madhubala Biopic: మధుబాల..’వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ జీవిత చరిత్ర సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కించేందుకు రెడీ అయిపోయాడు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.దీంతో ఈ పాత్రని పోషించే అదృష్టం ఎవరికి దక్కుతుందా అని క్యూరియస్ గా వాచ్ చేసిన మూవీ లవర్స్ కి షాక్ ఇస్తూ కళ్యాణి ప్రియదర్శన్ ని సెలెక్ట్ చేశాడన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.నిజానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవి, సారా అర్జున్, కియారా అద్వానీ వంటి పేర్లు గట్టిగా వినిపించినా చివరికి ఆ ఛాన్స్ దక్కించుకుందని బి టౌన్ లో వినిపిస్తున్న టాక్.

కళ్యాణిలో మధుబాల స్థాయి గ్రేస్ ఉందా?

అయితే ‘లోకా’ సినిమాతో పాన్-ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణిలో మధుబాల స్థాయి గ్రేస్ ఉందా?అన్నది ఇపుడు నెటిజన్ల నుండి వినిపిస్తున్న ప్రశ్న.ఎందుకంటే మధుబాల అంటే కేవలం అందం మాత్రమే కాదు,అభినయం కూడా.అలాంటి పాత్రకి సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాకుండా కళ్యాణిని ఎంచుకోవడం ఏంటో అని డిసప్పాయింట్ అవుతున్నారు మధుబాల ఫ్యాన్స్.అయితే కళ్యాణి ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ తో ‘ప్రళయ్’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న కారణంగానే భన్సాలీ ఆమెకు ఈ అవకాశం ఇచ్చారని,ఇది ‘మిస్ కాస్టింగ్’ అవడం పక్కా అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు, నిజంగానే మధుబాల జీవితంలో జరిగిన సంఘటనలని కల్యాణి సరిగ్గా పలికించకపొతే మాత్రం కల్యాణి తో పాటు భన్సాలీ కూడా ట్రోలర్స్ కి స్టఫ్ అవ్వడం ఖాయం.

also read:చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… ఐటెం సాంగ్ కోసం ఆ బ్యూటీని దింపుతున్న బుచ్చిబాబు?

లేటెస్ట్ గా రణ్‌వీర్ సింగ్ పక్కన ‘ప్రళయ్’

ఇక కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పాత్రల్ని చూస్తె అంతగా గుర్తుపెట్టుకునెంత నటన ఎక్కడా చేయలేదని,కేవలం ‘లోకా:చాప్టర్ 1’ సక్సెస్ చూసే ఈ ఛాన్స్ వచ్చిందని బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.అయితే ‘లోకా:చాప్టర్ 1’ సక్సెస్ లో కల్యాణి నటన కన్నా సినిమా మేకింగ్ కే ఎక్కువ మార్కులు పడ్డాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.ఇక లేటెస్ట్ గా రణ్‌వీర్ సింగ్ పక్కన ‘ప్రళయ్’ అనే సినిమాలో ఛాన్స్ వచ్చినంత మాత్రాన,ఆమె మధుబాల స్థాయి నటి అయిపోదంటూ అప్పుడే ట్రోల్స్ మొదలెట్టేశారు కూడా.

“ప్యార్ కియా తో డర్నా క్యా” అంటూ

ఇక మధుబాల విషయానికి వస్తే 1933 ఫిబ్రవరి 14న పుట్టిన ఈమె అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావి.తన 9వ ఏటనే ‘బసంత్’ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ గా ఎదిగింది.ముఖ్యంగా ‘మొఘల్-ఎ-అజామ్’ చిత్రంలో ఆమె పోషించిన అనార్కలి పాత్ర ఎవర గ్రీన్ అని చెప్పాలి.అందులో “ప్యార్ కియా తో డర్నా క్యా” అంటూ ఆమె పలికించిన ఎక్స్ప్రెషన్స్ నేవర్ బిఫోర్,ఎవర ఆఫ్టర్.అయితే సినిమాల పరంగా ఎంత హైట్స్ చూసిందో పర్సనల్ లైఫ్ లో అంత బాధల్ని మూటగట్టుకుంది.ముఖ్యంగా ఆమె దిలీప్ కుమార్‌తో నడిపిన ప్రేమాయణం పెళ్లి వరకు రాకపోవడం ఆమెని బాగా కుంగ దీసింది.

చివరి రోజుల్లో ఇలా అనాధలా 

ఆ తర్వాత 1960లో ప్రముఖ గాయకుడు,నటుడు కిషోర్ కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకున్నప్పటికి అది చివరవరకి కొనసాగాకుండానే సమాప్తం అయింది.మధుబాలకి హార్ట్ లో హోల్ ఉందన్న విషయం తెలీడంతో,ట్రీట్ మెంట్ కోసం లండన్ తీసికెళ్ళినా ప్రయోజనం లేకపోయిందట.దీంతో కిషోర్ కుమార్ ఆమెను తన పాత బంగ్లాలో ఉంచి సరిగ్గా పట్టించుకోకపోవడంతో దిక్కులేని అనాధలా చనిపోయిందని చెప్పుకుంటారు.ఏది ఏమైనా కోట్లాది ప్రేక్షకులని తన అందం అభినయం తో కట్టిపడేసిన ఈ అపురూప సుందరి చివరి రోజుల్లో ఇలా అనాధలా చనిపోవడం చాలా బాధాకరం.మరి ఇంతటి ఇంటెన్స్,ఎమోషన్స్ ఉన్న మధుబాల పాత్రలో కల్యాణి ఎలా ఒదిగిపోతుందో వేచి చూడాల్సిందే!

also read:కృతజ్ఞత లేని టాలీవుడ్…ఆ ఇద్దరు దిగ్గజాలు చనిపోతే ఒక్క హీరో కూడా రాలేదా?

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×