E-Paper
Advertisement

Decoit: మళ్ళీ వాయిదా పడ్డ అడివి శేష్ డెకాయిట్.. కొత్త తేదీ ఎప్పుడంటే?

Decoit: మళ్ళీ వాయిదా పడ్డ అడివి శేష్ డెకాయిట్.. కొత్త తేదీ ఎప్పుడంటే?
Advertisement

Decoit:వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ఆయన నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ (Dacoit: A Love Story) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ విడుదల మళ్ళీ వాయిదా పడటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాలలోకి వెళితే ..

ఉగాది రేసు నుండి తప్పుకున్న ‘డెకాయిట్’:

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా మొదట మార్చి 19, 2026న ఉగాది కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ నెలకు వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా బజ్ ప్రకారం, ఏప్రిల్ మొదటి వారంలో లేదా ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

విజువల్ వండర్ గా డెకాయిట్..

Advertisement

టాలెంటెడ్ హీరో అడివి శేష్ , మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న ‘. డెకాయిట్’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అడివి శేష్‌కు అత్యంత సన్నిహితుడు, ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన షానీల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో శేష్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో, షానీల్ డియో ఈ చిత్రాన్ని సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, సరికొత్త విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ALSO READ:Tollywood: లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత.. మరణానికి కారణాలు?

యాక్షన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ:

Advertisement

షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ ప్రాజెక్ట్. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, గ్రిప్పింగ్ గా సాగే ఒక లవ్ స్టోరీ అని చిత్ర బృందం చెబుతోంది. అడివి శేష్ తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా చాలా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. చాలా కాలం తరువాత శేష్ చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

కొత్త విడుదల తేదీపై అంచనాలు..

వరుస వాయిదాల వల్ల అభిమానులు కొంత నిరాశ చెందినా, అవుట్‌పుట్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఏప్రిల్ నెలలో సమ్మర్ సీజన్ ప్రారంభం కావడంతో, ఆ సమయంలో ‘డెకాయిట్’ విడుదల కావడం సినిమా కలెక్షన్లకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అడివి శేష్ తన మార్క్ సస్పెన్స్ అండ్ యాక్షన్‌తో మరోసారి థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×