E-Paper
Advertisement

Huawei Watch vs Amazfit Balance: స్టైలిష్ లుక్ కావాలా? అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కావాలా? 2 బెస్ట్ వాచ్‌ల రివ్యూ మీకోసమే!

Huawei Watch vs Amazfit Balance: స్టైలిష్ లుక్ కావాలా? అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కావాలా? 2 బెస్ట్ వాచ్‌ల రివ్యూ మీకోసమే!
Advertisement

Huawei Watch vs Amazfit Balance: ప్రీమియం స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో హువాయి, అమేజ్‌ఫిట్ బ్రాండ్‌ల మధ్య ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. ఇప్పుడు Huawei Watch GT 5 Pro, Amazfit Balance 2 మధ్య జరుగుతున్న వార్ యూత్‌ని ఆకర్షిస్తోంది. ఒకటి క్లాసిక్ లగ్జరీ లుక్‌తో వస్తుంటే.. మరొకటి హెల్త్ , ఏఐ (AI) ఫీచర్లతో కేక పుట్టిస్తోంది. స్టైల్‌తో పాటు మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఈ రెండింటిలో ఏది పర్ఫెక్ట్? దేని కోసం మీ డబ్బు ఖర్చు చేయడం లాభం? ఈ రెండింటి అసలు తేడాలను క్లియర్ గా తెలుసుకుందాం.

Huawei Watch GT 5 Pro vs Amazfit Balance 2: పూర్తి రివూ..

Advertisement

1. డిజైన్, బిల్డ్ క్వాలిటీ:
Huawei Watch GT 5 Pro: దీని ప్రధాన బలం దాని డిజైన్. 46mm మోడల్ టైటానియం బాడీ, సఫైర్ గ్లాస్‌తో వస్తుంది. ఇది పక్కా లగ్జరీ వాచ్‌లా ఉంటుంది. మీరు సూట్ వేసుకున్నా లేదా క్యాజువల్ డ్రెస్‌లో ఉన్నా ఇది చాలా క్లాసీగా కనిపిస్తుంది.
Amazfit Balance 2: ఇది అల్ట్రా లైట్ వెయిట్, స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. ఇది చూడటానికి మోడ్రన్ గా, స్పోర్టీగా ఉంటుంది. రోజంతా చేతికి పెట్టుకున్నా మీకు అస్సలు బరువుగా అనిపించదు.

2. డిస్‌ప్లే అద్భుతం:
రెండు వాచ్‌లలోనూ AMOLED డిస్‌ప్లేలు ఉన్నాయి.

Advertisement

Huawei: దీని డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా ఉంటుంది. ఎండలో చూసినా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

Amazfit: దీనిలో ఉన్న రిఫ్రెష్ రేట్ వల్ల టచ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే (AOD) ఫీచర్ చాలా బాగుంటుంది.

3. హెల్త్, ఏఐ (AI) ఫీచర్లు:
Amazfit Balance 2: ఈ వాచ్‌లో హెల్త్ ట్రాకింగ్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ముఖ్యంగా మీ శరీరం ఎంత అలసిపోయిందో చెప్పే ‘Readiness Score’ దీని స్పెషాలిటీ. ఏఐ కోచ్ సహాయంతో మీరు మీ వర్కౌట్స్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
Huawei GT 5 Pro: దీనిలో హార్ట్ రేట్ , SpO2 ట్రాకింగ్ చాలా ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా రన్నింగ్, గోల్ఫ్, డ్రైవింగ్ చేసే వారికి ఇది స్పెషల్ డేటాను అందిస్తుంది.

4. బ్యాటరీ లైఫ్ :
స్మార్ట్‌వాచ్ విషయంలో ఛార్జింగ్ సమస్య పెద్ద తలనొప్పి.

Huawei: హువాయి వాచ్‌లు బ్యాటరీకి పెట్టింది పేరు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 10 నుంచి 14 రోజుల వరకు వస్తుంది.

Amazfit: అమేజ్‌ఫిట్ కూడా తక్కువ కాదు.. సాధారణ వాడకంతో 10 రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. కానీ హెవీ ఫీచర్స్ వాడితే హువాయి కొంచెం మెరుగ్గా ఉంటుంది.

5. కాలింగ్, ఇతర ఫీచర్స్:
రెండింటిలోనూ బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం ఉంది. మీ వాచ్ నుంచే ఫోన్ మాట్లాడవచ్చు. హువాయిలో స్పీకర్ వాల్యూమ్ చాలా క్లారిటీగా ఉంటుంది. అమేజ్‌ఫిట్‌లో యాప్ సపోర్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, మీరు మరిన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Also Read: యూత్ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు.. రూ. 2 వేల లోపే ఇన్ని మంచి ఫీచర్లా ? బాబోయ్..

ధర ఎంత ?
Huawei Watch GT 5 Pro: ఇది లగ్జరీ కేటగిరీ కాబట్టి దీని ధర సుమారు రూ. 30,000 నుంచి రూ. 35,000 మధ్య ఉండవచ్చు.

Amazfit Balance 2: ఇది కొంచెం ఎకనామిక్ రేంజ్. దీని ధర సుమారు రూ.22,000 నుంచి రూ. 26,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

మీకు బడ్జెట్ అడ్డుకాదు, చేతికి పెట్టుకుంటే ఒక లగ్జరీ కార్ చూసినంత ఫీల్ రావాలి అనుకుంటే.. Huawei Watch GT 5 Pro తీసుకోండి. అలా కాకుండా.. టెక్నాలజీ ఎక్కువగా ఉండి, హెల్త్ ట్రాకింగ్, తక్కువ బరువు ఉన్న వాచ్ కావాలంటే Amazfit Balance 2 బెస్ట్ ఛాయిస్.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×